తారక్, కళ్యాణ్ రామ్ స్పందించరేమి.. నారా రామూర్తి మరణం

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:16 PM

హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు మృతిపట్ల జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్‌ల వైపు నుంచి ఎలాంటి సంతాప ప్రకటన రాకపోవడంతో సరికొత్త చర్చకు దారితీస్తోంది.

హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు (72) శనివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రోహిత్, చంద్రబాబులను ప్రత్యక్షంగా, పరోక్షంగా పరామర్శించారు. అయితే జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్‌ల వైపు నుంచి ఎలాంటి సంతాప ప్రకటన రాలేదన్న చర్చ వీపరీతంగా నడుస్తొంది.


నారా రామ్మూర్తి నాయుడు మరణంపట్ల జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ ల నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆయన చనిపోయిన తర్వాత పలువురు సెలబ్రిటీలు ఆయన చూసేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. కానీ.. ఏ మీడియాలోనూ తారక్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి గాని పర్సనల్‌గా కలిసిన సన్నివేశాలు కనిపించలేదు. అలాగే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగాను ఎలాంటి సంతాప ప్రకటన చేయలేదు. రామ్మూర్తి నాయుడు స్వస్థలం నారావారిపల్లెలో నిర్వహించిన అంత్యక్రియల్లోను పాల్గొనలేదు. దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా, తారక్ ఫ్యామిలలా మధ్యలో ఉన్న అంతర్గత వైరుధ్యాలు మరోసారి తెరపైకొచ్చాయి.


మరోవైపు నందమూరి కుటుంబం నుండి రామ్మూర్తి నాయుడి మరణంపై నందమూరి రామకృష్ణ తొలుత సంతాపం ప్రకటించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రామకృష్ణ... కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బాలకృష్ణ తనయుడు అప్ కమింగ్ టాలీవుడ్ హీరో తన సోషల్ మీడియా వేదికగా సంతాప ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 18 , 2024 | 04:19 PM