Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

ABN , Publish Date - Dec 24 , 2024 | 09:02 PM

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌషిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కౌషిక్‌ వైద్య చికిత్సకు అయిన నగదును జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారు. దీంతో మంగళవారం చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్ అయ్యారు.

JR NTR Pays Kaushik Medical Bill

ఎన్టీఆర్ అభిమాని కౌషిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కౌషిక్ చికిత్సకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారు. దీంతో కౌషిక్ ఆసుపత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్‌పై కౌషిక్ తల్లి కామెంట్ చేశారు.


జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో.. కేన్సర్‌తో బాధపడుతోన్న తన వీరాభిమాని కౌషిక్‌కు సాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత తమను పట్టించుకోలేదంటూ కౌషిక్ తల్లి సరస్వతి ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు కౌశిక్ వైద్య పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి.. బిల్లు చెల్లించారు. ఆ బిల్లును అతడు సోషల్ మీడియలో షేర్ చేశాడు. కౌషిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని ఆయన పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా.. కౌషిక్ తల్లి సరస్వతి మాట్లాడుతూ.. తమ కుమారుడు క్యాన్సర్‌తో బాధపడుతోన్న సమయంలో ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. వైద్య చికిత్సకు కావాల్సిన సహయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. దేవర సినిమా విడుదల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సోమవారం కౌషిక్ తల్లి సరస్వతి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా స్పందించారు. తమకు సహయం చేయాలని కోరారు.

Updated Date - Dec 24 , 2024 | 09:07 PM