Jr NTR: దేవ‌ర ఎఫెక్ట్‌.. ఇత‌ర భాష‌ల ద‌ర్శ‌కుల‌ను లైన్‌లో పెట్టిన‌ ఎన్టీఆర్

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:52 AM

RRR సినిమా అనంత‌రం వ‌చ్చిన గ్లోబ‌ల్ గుర్తింపుతో జూ. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో త‌న‌ మార్కెట్‌ను పెంచుకునే ప్లానింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ntr

RRR సినిమా అనంత‌రం వ‌చ్చిన గ్లోబ‌ల్ గుర్తింపుతో జూ. ఎన్టీఆర్ (Jr NTR) పాన్ ఇండియా స్థాయిలో త‌న‌ మార్కెట్‌ను పెంచుకునే ప్లానింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఇత‌ర భాష‌ల అగ్ర ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు వ‌రుస‌గా సినిమాల‌ను సెట్ చేసుకుంటున్నాడు. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే బాలీవుడ్‌లో వార్ 2 ( War 2) సినిమాను చేస్తూ ఉండ‌గా ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమా లైన్ లో ఉంది.. ఓపెనింగ్ కూడా అయింది.

ఇదిలాఉండ‌గా.. వ‌రుణ్ డాక్ట‌ర్ అంటూ శివ కార్తికేయ‌న్‌కు మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చి గ‌త సంవ‌త్స‌రం ర‌జ‌నీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ జైల‌ర్ (Jailer) సినిమాను రూపొందించిన‌ తమిళ అగ్ర‌ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) కాంబోలో ఓ సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. దేవర (Devara) సినిమా పాన్ ఇండియాగా విడుదలైనా.. దర్శకుడు కొరటాల కావటం తెలుగులో మినహా ఎక్కడ సరైన బజ్ వచ్చింది లేదు.

NTr.jpg

తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ (Jr NTR) కున్న క్రేజ్ వళ్ల‌ రెవెన్యూ కనిపించింది కానీ.. ఇతర భాషల్లో ఆశించిన వసూళ్లు కూడా దేవర అందుకోలేకపోయిందనే అపవాదు ఉంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా ఇత‌ర న‌టుల లాగా అదర్ లాగ్వెంజేస్ మార్కెట్ పై దృష్టి పెట్టినట్టుగా కన్పిస్తుంది..అందుకే ఇతర భాషల్లోని టాప్ ఫిలింమేకర్స్ కాంబోలో సినిమాలను సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇదిలాఉండ‌గా నెల్సన్ ఎన్టీఆర్ ల సినిమాను హంబోలే ఫిలింస్ లేదా హారికా హాసినీ సంస్దల్లో ఒకటి నిర్మించే అవకాశముందని తెలుస్తొంది.

కాగా ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' సినిమాతో బిజీగా ఉండగా.. తారక్ వార్ 2, నీల్ సినిమాల షూటింగ్ లోో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయేలోపు నెల్సన్ కూడా ఫ్రీ కానున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

Updated Date - Nov 11 , 2024 | 11:52 AM