Devara Twitter Review: ‘దేవర’ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చా.. సినిమా ఎలా ఉందంటే! ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - Sep 27 , 2024 | 05:13 AM
దేవర పార్ట్ 1సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు తమ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి వారికి సినిమా ఎలా అనిపించిందో వారి, మాటలు, పోస్టుల ద్వారా తెలుసుకుందాం.
రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలామంది ఎన్టీఆర్ (jr NTR) అభిమానులు సుమారు ఆరేళ్లకు పైగా ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ దేవర పార్ట్ 1 (Devara1) సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ సంబురాలు అంబరాన్నంటాయి. అర్థరాత్రి 1 గంట షోతో రెండు తెలుగు స్టేట్స్‌లో ప్రత్యేక షోలు స్టార్ట్ అవ్వగా 12 గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ఇప్పటికే ఓవర్సిస్‌లో ఎర్లీ షోస్ కంప్లీట్ చేసుకోగా మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లోనూ బొమ్మ పడిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి వారికి సినిమా ఎలా అనిపించిందో వారి, మాటలు, పోస్టుల ద్వారా తెలుసుకుందాం.
సినిమా 177.58 నిమిషాలు (2.58గంటలు) నిడివితో ప్రారంభమైన మూవీ అన్ని వర్గాల ప్రజల నుంచి పాజిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా మొత్తానికి జూ.ఎన్టీఆర్ హైలెట్‌గా ఉన్నాడని, ఎంట్రీ సీన్ అయితే ప్యాన్స్ బట్టలు చించుకునేలా ఉందని, అసలు కొరటాల నుంచి ఇలాంటి సినిమా ఎక్సపర్ట్ చేయలేదని అంటున్నారు. అలాగే అనిరుద్ రవిచందర్ సంగీతం, బ్యా గ్రౌండ్ స్కోర్ గూస్ బమ్స్ వచ్చేలా ఉన్నాయని, ముందు అనిరుద్ పాటలు విని ఏదో అనుకుంటే సినిమాలో విశ్వరూపమే చూయించాడంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స్టోరీ కాస్త తెలిసిన దానిలాగే అనిపించినా కొరటాల ఇచ్చిన ట్రీట్మెంట్ అదిరిపోయిందని, షార్క్ ఫైటింగ్ సీన్, మరో రెండు మూడు సందర్భాల్లో విజువల్స్ కూడా హాలీవుడ్ లెవల్‌లో ఉన్నాయంటున్నారు.
ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సింది యాక్షన్ సీన్లు అని వాటిని తెరకెక్కించన విధానం నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయని, సినిమాకే మేజర్ హైలెట్‌గా ఉన్నాయని తెగ పొగిడేస్తున్నారు. సినిమా ఆరంభం, ఇంట్రో సీన్లు, ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ఓ స్థాయిలో ఉన్నాయని, హింసా దృశ్యాలు భారీగానే ఉన్నాయని తెలుపుతున్నారు. సింహాద్రిని మించి బ్లాక్‌బస్టర్ అని సినిమా మొత్తం కేసీపీడీ అని ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తో ఇరగదీశాడని అంటున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ట్రోలింగ్‌కు పూర్తి విరుద్దంగా సినిమా ఉందని ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే అవుతుందని, ప్రతి అభిమాని గర్వంగా కాలర్ ఎగరేసుకోవచ్చని పోస్టులు పెడుతున్నారు.
రాజమౌళి సినిమాల్లో నటించిన వారి తదుపరి సినిమాలు ఫెయిల్ అవుతాయని ఉన్న నానుడికి దేవర చెక్ పడ్డట్టేనని కాఎంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడని, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను చూయించిన విధంగా ఏ దర్శకుడు ఇంతవరకు చూయించలేదని పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా మాస్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ చెప్పినట్టుగానే చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను సీట్లో కూర్చోకుండా చేశారని చెబుతున్నారు. ప్రధానంగా సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్‌కు దండం పెట్టాల్సిందే అని అదేవిధంగా జాన్వీ స్క్రీన్ ప్రజెన్స్, సైఫ్ అలీఖాన్ నటన అద్భుతంగా కుదిరాయని, సినిమాకు అదనపు బలంగా ఉన్నాయని సినిమా చూసిన వారు తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ రివ్యూలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు సినిమా చూసి అ ఎంజాయిమెంట్‌ను ఫీల్ కావాల్పిదే అని కోరుతున్నారు.
ఇదిలాఉండగా మరికొంతమంది సినిమా ఏం బాగోలేదని, రొటిన్ సినిమా చూసినట్టుగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సంగీతం, ఎన్టీర్ మినహా చెప్పుకోతగ్గవి మరేమీ లేవని వారి కోసం మూవీ ఒక్కసారి చూడొచ్చని అంటున్నారు. మరి కొంతమంది అభిమానులకు మాత్రం బాగా నచ్చుతుందని అనగా.. అచార్య2 లా ఉందని, లాగ్ ఎక్కువగా ఉందని, అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని కొద్దిమంది ట్వీట్లు చేశారు. చూడాలి మరి చివరకు సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో.