Devara: రిలీజ్‌కు.. ముందే దేవర సంచలనం
ABN , Publish Date - Sep 25 , 2024 | 08:13 AM
మొదటి నుంచి నెగిటీవీ బాగా జరుగుతన్న దేవర సినిమాకు ఏ విషయంలోనూ కలిసి రావడం లేదనుకుంటున్న సమయంలో ఈ మూవీ ఓవర్‌సీస్ బుకింగ్స్ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
సుమారు ఆరేండ్ల తర్వాత జూ. ఎన్టీఆర్ (Jr Ntr) దేవర (Devara) తో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇటీవల ప్రతి విషయంలో హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి నెగిటివిటీనే ఎక్కువగా తెచ్చుకున్న ఈ సినిమా.. ట్రైలర్ విడుదలయ్యాక మరింతగా చర్చలకు దారి తీసింది. ఆపై ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దవడంతో దేవర సినిమాకు ఏదీ కలిసి రావడం లేదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అలాంటి వార్తలన్నింటికి చెక్ పెడుతోంది. అనూహ్యంగా దేవర ఓవర్‌సీస్ బుకింగ్స్ సినీ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు, ప్రీమియర్ షోస్‌లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన అనుమతులు రావడంతో దేవర టీం మంచి జోరులో ఉంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డులు తిరగరాస్తుండడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోస్‌తో పాటు డే వన్ బుకింగ్స్ దాదాపు $4.7 - $5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 37-42 కోట్ల వసూళ్లను రాబట్టనుంది. ఒకవేళ పాజిటివ్ మౌత్ టాక్ వస్తే రెండో రోజుకే ఇది $5.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 46 కోట్లకు చేరనుంది. మరోవైపు అమెరికాలో ఒక్కో టికెట్ ధర $30 డాలర్లుగా ఉండటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇంతా పెట్టి టికెట్ కొన్నాకా సినిమా ఏదైన తేడా కొడితే బాగోదని కామెంట్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం దేవర (Devara) సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. కొంతమంది బుకింగ్స్ బాగా ఉన్నాయని, అల్రేడీ హౌస్‌ఫుల్స్ అయ్యాయని బుక్ మైషోలో రెండు రోజుల్లో 363k టికెట్లు అమ్ముడై కల్కి బుకింగ్స్‌ను దాటి పోయాయని అంటుండగా.. మరికొంతమందేమో అసలు టికెట్లు తెగట్లేవని, థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటూ స్క్రీన్ షాట్లతో పోస్టులు పెడుతూ నెటిజన్ల బుర్రలు పాడయ్యేలా చేస్తున్నారు. వీటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియక ఫ్యాన్స్, సినీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. అయునప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం దేవర ఫీవర్ మొదలైంది.