Jr Ntr: తారక్‌ చేతికి మరో ఖరీదైన వాచీ!

ABN , Publish Date - Sep 14 , 2024 | 02:03 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌కు వాచీలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర రకరకాల వాచీల కలెక్షన్‌ ఉంది. అవన్నీ బాగా ఖరీదైనవి.


స్టార్‌ హీరోలు హెయిర్‌ స్టైల్‌ నుంచి, వేసుకునే దుస్తులు, చేతి వాచ్‌, కాళ్లకు వేసుకునే షూస్‌ వరకూ అభిమానులకు, యువతకు ఆసక్తిగానే ఉంటుంది. అయితే ఆయనకు వాచీలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర పెద్ద కలెక్షన్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఓ ఖరీదైన వాచ్ ధరిస్తున్నారు. ఆ వాచ్‌ ధర, దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు వాచీలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర రకరకాల వాచీల కలెక్షన్‌ ఉంది. అవన్నీ బాగా ఖరీదైనవి. ప్రస్తుతం ఆయన ముంబైలో 'దేవర' చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో తారక్‌ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ముఖ్యంగా ఆయన ధరించిన  Audemars Piguet (AP) Royal Oak Concept Split Chronograph GMT  లార్జ్‌ డేట్‌ వాచ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్‌ ధర గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్‌ తెగ గూగుల్‌ చేస్తున్నారు. అయితే ఈ ఫ్యాన్సీ వాచ్‌ ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.21 కోట్లు అని తెలుస్తోంది.  

ఇది కాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌ సమయంలో ఆయన మరో వాచీ ధరించారు దాని ధర కూడా ఎక్కువే.

ఆ వాచ్‌ బ్రాండ్‌ పటేక్‌ ఫిలిప్పె..
ధర: రూ.2.49కోట్లు,
ప్రత్యేకతలు: ప్లాటినం కేసు,
ఖరీదైన తోలుతో తయారు చేసిన స్ర్టాప్‌,
స్ర్కాచ్‌ రెసిస్టెన్స్‌, వాటర్‌ప్రూఫ్‌..
బంగారం, వజ్రాలు, అత్యంత ఖరీదైన లోహాలు దీని తయారీలో వాడారు. ఇవే కాకుండా తారక్‌ దగ్గర మరెన్నో ఆకర్షణీయమైన వాచీల కలెక్షన్‌ ఉంది.
  


Updated Date - Sep 14 , 2024 | 02:03 PM