JR NTR: దేవరపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 06 , 2024 | 12:41 AM
"24 ఏళ్ల కెరీర్‌లో సినిమా విడుదల రోజు విదేశాల్లో ఉండటం ఎప్పుడూ జరగలేదు. ‘దేవర’ (Devara) ప్రీరిలీజ్ వేడుక జరగకపోవడం కూడా వెలితిగానే ఉంది’’ అని జూ.ఎన్టీఆర్ (tarak) అన్నారు.
"24 ఏళ్ల కెరీర్‌లో సినిమా విడుదల రోజు విదేశాల్లో ఉండటం ఎప్పుడూ జరగలేదు. ‘దేవర’ (Devara) ప్రీరిలీజ్ వేడుక జరగకపోవడం కూడా వెలితిగానే ఉంది’’ అని జూ.ఎన్టీఆర్ (tarak) అన్నారు. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ (koratala Siva) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్ కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన తారక్ ‘బ్లాక్‌బస్టర్ జర్నీ ఆఫ్ దేవర’ పేరుతో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Chitchat with NTR and Koratala Siva)
ఈ జన్మలో తీర్చుకోలేనేమో..
"ప్రతి సినిమాలాగే ఈ చిత్రానికి కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశాం. అభిమానులు నన్ను చూడటం కన్నా నేను వాళ్లను చూడటం చాలా ముఖ్యమనే ఉద్దేశంతోనే ప్రీరిలీజ్ ఈవెంట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ‘దేవర’ గురించి వాళ్లతో చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. అది రద్దు అయింది. సినిమా సక్సెస్‌ను అభిమానులతో పంచుకోవడానికైనా ఈవెంట్ పెడదామంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా అవుట్‌డోర్ వేడుకలకు అనుమతి లభించలేదు. నా ఫ్యాన్స్ 24 ఏళ్లుగా నన్ను మోస్తున్నారు. ‘దేవర’పై మీరు చూపిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో. కానీ, ఒక విషయమైతే చెబుతా.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే నా బాధ్యత. ఈ సినిమాను ఆదరించి కొత్త ఊపిరి పోసినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను’’ అని తారక్ అన్నారు.
ఆ కష్టం అర్థం కావట్లేదు..
సినిమాలో జాన్వీకపూర్ నిడివి చాలా తక్కువని చాలామంది అంటున్నారు. ‘దేవర2లో తంగం, వర మధ్య ప్రేమ ఇంకా డెప్త్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాను లెక్కలు వేసుకుని చూస్తున్నారు. ఒకదానితో ఒకటి పోలికలు పెడుతున్నారు. ‘బాగోలేదు’ అని చాలా సింపుల్‌గా అనేస్తున్నారు. ఓ సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందనేది అర్థం చేసుకోవడం లేదు. కామెంట్లు సర్వసాధారణం అయిపోయింది. నెగెవిటీ పెరిగీపోయింది. సినిమాను తూకంలో పెట్టి మరీ చూస్తున్నారు. మా పిల్లలు అభయ్, భార్గవ్‌లకు ఏ సినిమా అయినా నచ్చుతుంది. కథలో లీనమై చూసినప్పుడే ఆ సినిమా మనసుకు చేరుతుంది’’
అభిమానులు చెప్పాకే తెలిసింది...
‘ఆయుధపూజ పాటను చాలా తక్కువ సమయంలో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అనిరుధ్ అమెరికా పర్యటనకు వెళ్లాడు. రెండు రోజుల్లో పాట షూటింగ్ ఉందనగా ఫోన్ చేసి ట్యూన్ ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి కేవలం గంటలోనే రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎర్ర సముద్రంలో ఉండిపోయారు. అందుకే అంత బాగా ఆ పాట రాయగలిగారు. కొరియోగ్రాఫర్ గణేశ్‌చార్యతో కలిసి చేసిన మొదటి పాట ఇది. తాతగారిని ఇమిటేట్ చేయాలని అందులో స్టెప్ చేయలేదు. ఆ విషయం కూడా మాకు తెలియదు. పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే తెలిసింది’’ అన్నారు.
అందుకే దావూదీ తీసేశాం...
"సినిమాలో ఒక పాటను అదనంగా కలపాలంటే సెన్సార్ అనుమతులు కావాలి. ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేం. ఐదు భాషల్లో ఓ పాటను పెట్టాలంటే సమయం పడుతుంది. దావూదీ పాట తీసేయడం నాతో సహా అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా వేగం పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ‘దావుదీ పాట’ పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేేస్త బాగుంటుందని అందరికీ ఉంటుంది. కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం’’ అని కొరటాల శివ అన్నారు.