Jani Master: జానీ మాస్టర్ దోషి.. చార్జ్ షీట్‌లో పోలీసులు
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:15 PM
జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు సంచలన చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇంతకీ దాంట్లో ఏముందంటే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈవెంట్ ల మహిళలను పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాటుపడినట్లు పోలీసులు నిర్దారించారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు.
కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కొన్ని రోజుల కింద గోవాలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆయన ఇటీవల విడుదల అయ్యారు. 36 రోజులపాటు జానీ జైలులో ఉండగా.. అదే సమయంలో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు సైతం క్యాన్సిల్ అయ్యింది. ఇప్పటికే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై జానీ మాస్టర్ న్యాయపోరాటం చేస్తున్నారు.