Jani Wife Sumalatha:ఆయనేమో  అన్న.. నువ్వు  వదిన  అంటూ మోసం 

ABN , Publish Date - Sep 28 , 2024 | 10:57 AM

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani master)) కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani master)) కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జానీమాస్టర్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు (Film Chamber of Commerce) జానీ మాస్టర్ భార్య సుమలత (Sumalatha) ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని తెలిపింది.

‘‘ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్‌పై తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే...ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది’’ అని వాపోయింది.

Updated Date - Sep 28 , 2024 | 01:44 PM