Janhvi kapoor: వాళ్లే మన సినిమా చూస్తుంటే మీకేంటి నొప్పి..
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:22 PM
‘పుష్ప2’ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్’ రీ రిలీజ్ వాయిదా పడిందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi kapoor) స్పందించారు.
అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప-2' (Pushpa 2) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే! అయితే ఈ చిత్రానికి ఉత్తరాదిన అధిక థియేటర్లు కేటాయించడం కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘పుష్ప2’ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్’ రీ రిలీజ్ వాయిదా పడిందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi kapoor) స్పందించారు. సినీప్రియులకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో ‘ఇంటర్ స్టెల్లార్’ ఒకటి. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2014లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని భావించారు. అయితే ఎక్కువ శాతం ఐమాక్స్ స్క్రీన్స్ లో ‘పుష్ప2’ ఉండడంతో దీని రీరిలీజ్‌ను ఇండియాలో వాయిదా వేశారు. దీంతో కొందరు ‘పుష్ప2’కు ఎక్కువ థియేటర్‌లు ఇచ్చారంటూ విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ మీమ్స్ పేజ్ పోస్ట్ పెట్టింది. దీనికి జాన్వీకపూర్ రిప్లై ఇస్తూ ‘పుష్ప2’కు సపోర్ట్ చేశారు. (Janhvi kapoor Support to Pushpa 2)
‘‘పుష్ప2’ కూడా సినిమానే కదా.. ఎందుకు మరొకదానితో దీన్ని కంపేర్ చేస్తూ తక్కువ చేస్తున్నారు. మీరు ఏదైతే హాలీవుడ్ సినిమాను సపోర్ట్ చేస్తున్నారో.. వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ.. మనం మాత్రం మన చిత్రాలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. తెలుగు సినిమాకు జాన్వీ మద్దతివ్వడం చూసి ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ధైర్యంగా సమాధానం ఇచ్చారంటే కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది జాన్వీ ‘దేవర’తో (Devara) తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాతో హిట్ అందుకున్న ఆమె మరో సినిమాతో అలరించడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రానున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ఆర్‌సీ 16’ (RC16) పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది.