Janhvi Kapoor: పుష్పరాజ్‌తో ఆడిపాడటానికి సై?
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:00 PM
అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 'పుష్ప-2’లో (Pushpa-2)మెరవనుందా? బన్నీతో ఆడిపాడి అలరించనుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor) 'పుష్ప-2’లో (Pushpa-2)మెరవనుందా? బన్నీతో ఆడిపాడి అలరించనుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా...’ అంటూ పాట ఎంత ఊపు ఊపిందో తెలిసిందే. అందులో సమంత చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. ‘పుష్ప 2’లో కూడా ఆ తరహాలోనే ఓ ప్రత్యేక గీతం ఉంటుందని మొదటి నుంచి టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా పలువురి బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి.
తాజాగా జాన్వీ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. పుష్పరాజ్ పక్కన జాన్వీ కాలు కదపడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. మరి ఈ ప్రత్యేక గీతంలో ఆడి పాడడానికి సై అన్నారా? లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే జాన్వీ తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ 'దేవర' (Devara)చిత్రంతోపాటు రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే! చరణ్ (RC 16)సినిమా వేసవిలో ప్రారంభం కానుంది. ‘పుష్ప 2’లో ప్రత్యేక గీతానికి జాన్వీ 'ఊ’ అంటే టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో కలిసి నటించిన కథానాయిక అవుతుంది జాన్వీ.