Janhvi Kapoor: వ‌య్యారం ఓణి క‌ట్టింది.. సోష‌ల్ మీడియాలో ఆగం చేస్తోంది

ABN , Publish Date - Aug 19 , 2024 | 02:39 PM

జూ. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన చుట్ట‌మ‌ల్లే పాట‌ 7 కోట్ల‌కు పైగా వ్యూస్‌ ద‌క్కించుకుని స‌రికొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది.

jhanvi

జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR), జాన్వీ కపూర్‌(Janhvi kapoor) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' (Devara). ఈ సినిమాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ అతిలోక సుంద‌రి శ్రీదేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ ఈ మూవీతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి, సౌత్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతోంది.

Janhvi Kapoor

2018లో ద‌డ‌క్ అనే హిందీ చిత్రంతో సినిమాల్లోకి ఆరంగేట్రం చేసిన ఈ చిన్న‌ది ఓ ప‌ది చిత్రాల వ‌ర‌కు న‌టించింది కానీ రావాల్సినంత గుర్తింపు ద‌క్కించుకోలేక. ఒక్క హిట్ కొట్ట‌లేక పోయింది. త‌న అందాల‌తో బాలీవుడ్‌లో నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చిన ఈ సుంద‌రి ఛాన్సులు ద‌క్కించుకోవ‌డంలో కాస్త వెనుక‌బ‌డింది.

Janhvi Kapoor

అయితే తాజాగా ఈ అమ్మ‌డు తెలుగు సినిమాల వైపు దృష్టి పెట్ట‌డంతో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌తో న‌టిస్తున్న సినిమా కాకుండా రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది.

Janhvi Kapoor

తాజాగా దేవ‌ర సినిమా నుంచి ఎన్టీఆర్‌, జాన్వీల‌పై చిత్రీక‌రించిన చుట్ట‌మ‌ల్లే పాట‌ను రెండు వారాల క్రితం విడుద‌ల చేయ‌గా సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అంతేకాదు యూ ట్యూబ్‌లో ఈ పాట ఇప్ప‌టికే 7 కోట్ల‌కు పైగా వ్యూస్‌ ద‌క్కించుకుని స‌రికొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ ఓ స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖిస్తోంది.


ఈ పాట విడుదలైన ముహూర్తం జాన్వీ పేరే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి నోళ్లలో నానుతుంది. ఆ పాట‌లో అమ్మ‌డి గ్లామ‌ర్‌కు, అందానికి, ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ, అందాల ప్ర‌ద‌ర్శ‌న, విజువ‌ల్స్‌, సంగీతం యువ‌త‌ను ఓ రేంజ్‌లో మెస్మ‌రైజ్ చేస్తోంది.

Janhvi Kapoor

దీంతో కుర్ర‌కారంతా న‌వ యువ శ్రీదేవిని ఆరాదించ‌డం మొద‌లు పెట్టేశారు. పాట‌లోని ప్ర‌తి స‌న్నివేశాన్ని ఫొటోలుగా మార్చుకుని త‌మ మొబైల్స్ వాల్‌పేప‌ర్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో ఇబ్బ‌గిముబ్బ‌డిగా వైర‌ల్ అవుతూ నేష‌న్ వైడ్‌గా జాన్వీ, దేవ‌ర పేర్ల‌ను ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Janhvi Kapoor

Updated Date - Aug 19 , 2024 | 02:39 PM