Jabardasth Rohini: పని లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి!
ABN , Publish Date - Jul 13 , 2024 | 01:54 PM
టీవీ నటి, జబర్దస్ట్ ఫేం రోహిణి (Jabardasth Rohini) మాంచి ఫైర్ మీదున్నారు. తన గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.
టీవీ నటి, జబర్దస్ట్ ఫేం రోహిణి (Jabardasth Rohini) మాంచి ఫైర్ మీదున్నారు. తన గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో తాజాగా వీడియో షేర్ చేశారు. ‘‘బర్త్‌డే బాయ్’ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ థీమ్‌తో ఒక ఫ్రాంక్ వీడియో చేశా. సోషల్ మీడియాలో అది బాగా వైరల్‌గా మారింది. ఇది కేవలం ప్రమోషన్ మాత్రమేనని, నిజమైన రేవ్‌పార్టీ కాదని చాలామందికి అర్థమైంది. ఆ వీడియోపై ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశా. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? తెలుసుకొని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. నేను మందు తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్‌లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా? ఆయన నాపై వ్యక్తిగతంగాను కామెంట్స్ చేశారు. సర్జరీ కారణంగా నేను లావయ్యానని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని ఆయనే చెప్పేశారు. లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా? జర్నలిస్టులు అంటే నిజానిజాలను తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేవారు. ఏమీ తెలుసుకోకుండా వచ్చి ఇలా ఇంటర్వ్యూల్లో కూర్చొనేవాళ్లు కాదు. మీరెలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో అర్థం కావడం లేదు. మీకు ఏమీ వర్క్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఏమీ తెలుసుకోకుండా ఇలా ఊరికే మాట్లాడకండి. మీరు పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే నా సమాధానం ఇంకోలా ఉండేది’’ అని సీరియస్ అయింది. (Fire on Senier journalist)
పలు కామెడీ షోలతో రోహిణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. 'సేవ్ ది టైగర్స్’ సిరీస్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రవికృష్ణ, సమీర్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రధారులుగా నటిస్తున్న ‘ద బర్త్‌డే బాయ్’లో ఆమె నటించారు. ఈ నెల 19న విడుదల కానుంది.