Indian 2: సినీ ప్రియుల కోరిక మేరకు ఏం చేశారంటే!

ABN , Publish Date - Jul 14 , 2024 | 11:56 AM

కమల్‌హాసన్‌ (Kamal haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian2) ఎన్నో అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కమల్‌హాసన్‌ (Kamal haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian2) ఎన్నో అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేకింగ్‌ పరంగా సినిమా ఉన్నతంగా ఉన్నప్పటికీ 3 గంటలకుపైగా నిడివి చాలా ఎక్కువగా ఉందంటూ సోషల్‌మీడియా వేదికగా సినీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం చిత్ర బృందం దృష్టికి వెళ్లగా త్వరితగతిన మార్పులు చేసింది. సినిమా నిడివి తగ్గించింది. దాదాపు 20 నిమిషాల నిడివిగల సన్నివేశాలను తొలగించింది. సుమారు 2 గంటల 40 నిమిషాల నిడివితో శనివారం సాయంత్రం నుంచి ‘భారతీయుడు 2’ చిత్రం థియేటర్స్‌లో సందడి చేస్తోంది. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ తర్వాత శంకర్‌ - కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. సిద్థార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్‌, ప్రియా భవానీ శంకర్‌, బ్రహ్మానందం, సముద్రఖని కీలక పాత్రలుపోషించారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కమల్‌హాసన్‌ నటన, ఆయన గెటప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు 3’ రానుంది.

Updated Date - Jul 14 , 2024 | 04:05 PM