DarlingTrailer: భార్య‌కు స్పిల్ట్ ప‌ర్స‌నాలిటీ ఉంటే.. అదిరిన ‘డార్లింగ్’ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:35 PM

ప్రియ‌ద‌ర్శి, న‌భా న‌టేష్,అన‌న్య నాగ‌ళ్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘డార్లింగ్’. జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

darling

ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), న‌భా న‌టేష్ (Nabha Natesh)లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన నూత‌న‌ చిత్రం ‘డార్లింగ్’(Darling). హనుమాన్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (Primeshow Entertainment) బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఈ సినిమాను నిర్మించ‌గా అశ్విన్ రామ్ (Aswin Raam) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈసంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

GR3U2lgWUAAkJ6Z.jpeg

పెళ్లి అనంత‌రం భార్య‌తో క‌లిసి పారిస్ పోవాల‌నేదే జీవిత అశ‌యంగా ఉన్న ఓ యువ‌కుడికి పెళ్లి అనంత‌రం భార్య‌కు స్పిల్ట్ ప‌ర్స‌నాటిలీ డిజార్డ‌ర్ ఉన్న సంగ‌తి తెలుస్తుంది. దీంతో క్ష‌ణాల్లో భార్య వివిధ ర‌కాలుగా మార‌డం, భ‌ర్త‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతూ ఉంటుంది.


GRu2WZWXEAA5U1Z.jpeg

ఈ క్ర‌మంలో భ‌ర్త త‌న కోరిక‌ను తీర్చుకున్నాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా అసాంతం వినోదాత్మకంగా ఫ్యామిలీ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంకా అన‌న్య నాగ‌ళ్ల (Ananya Nagalla), శివారెడ్డి, రఘుబాబు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తోండ‌గా వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు.

Updated Date - Jul 07 , 2024 | 02:11 PM