Mega Vs Allu Family: అల్లు అర్జున్ పై  ట్రోలింగ్‌.. హైపర్ ఆది స్పందన

ABN , Publish Date - Jul 23 , 2024 | 01:58 PM

మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అభిమానులకు  మధ్య సోషల్‌ మీడియాలో కొంతకాలంగా వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే!

మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అభిమానులకు  (Mega Family Vs Allu Family) మధ్య సోషల్‌ మీడియాలో కొంతకాలంగా వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్  (Allu arjun) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్లినప్పటి నుంచి వార్‌ మరింత పెద్దదైంది. సోషల్‌ మీడియాలో అభిమానులు విపరీతంగా ట్రోల్‌ చేసుకుంటున్నారు. దీనిపై ఎంతో మంది క్లారిటీ ఇచ్చినా తగ్గలేదు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గీతా ఆర్ట్స్‌ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్‌ 'మెగా కుటుంబం, అల్లు కుటుంబం అంతా ఒకటే’ అని చెప్పుకొచ్చారు. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో హైపర్‌ ఆది కూడా ఈ విషయంపై స్పందించారు.

'అల్లు అర్జున్  మీద పవన్  కల్యాణ్‌(Pawan Kalyan), మెగా ఫ్యామిలీకి ఎలాంటి కోపతాపాలు ఉండవు. ఆ రెండు కుటుంబాలు ఎప్పుడూ ఒకటే. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ అల్లు అర్జున్ గారిని కావాలని ట్రోల్‌ చేసేవారు ఇకనైనా ఆపేస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు. 

Updated Date - Jul 23 , 2024 | 01:58 PM