Samantha: చైతూకి మళ్లీ పెళ్లి.. సమంత రియాక్షన్ ఎలా ఉంటుందో!
ABN , Publish Date - Aug 08 , 2024 | 05:02 PM
అక్కినేని నాగచైతన్య(Naga chaitanya), శోభితా ధూళిపాళ్లకు (Sobhita Dhullipala) గురువారం ఉదయం నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఫొటోలతో నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా వెల్లడించారు
అక్కినేని నాగచైతన్య(Naga chaitanya), శోభితా ధూళిపాళ్లకు (Sobhita Dhullipala) గురువారం ఉదయం నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఫొటోలతో నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీవితాంతం ఆనందంగా, ప్రేమగా ఉండాలని ఆయన అభిలషిస్తూ ట్వీట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం అప్పుడే ట్రోలింగ్ మొదలుపెట్టారు. అక్కినేని కుటుంబానికి తొలి పెళ్లి కలిసి రాలేదేమో? నాగార్జునది రెండో పెళ్లే. సుమంత్ పెళ్లి కూడా డిస్టర్బ్ అయింది. సుప్రియకు కూడా పెళ్లి కలసి రాలేదు. నాగచైతన్య విషయంలోనూ అదే జరిగింది. సమంతని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకొన్నాడు. ఆ సంసారం నాలుగేళ్లు హాయిగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. చైతూ ఇప్పుడు శోభితతో నిశ్చితార్థం జరుపుకొన్నాడు. త్వరలోనే అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతాయి.
అయితే ఇప్పుడంతా సమంత (Samantha) మీదే దృష్టి పెట్టారు. మరి సమంత మాటేమిటి? సమంత కూడా మరో పెళ్లి చేసుకొంటుందా? అసలు చై రెండో పెళ్లి విషయంపై సామ్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న చర్చ నడుస్తోంది. అయితే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక ఇద్దరూ హుందాగానే వ్యవహరించారు. ఒకరి మీద ఒకరు ప్రత్యేక్షంగా ఎక్కడా కామెంట్స్ చేసుకోలేదు. అయితే సమంత తన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవాలని చూడలేదు. కుదిరిన ప్రతిసారీ పరోక్షంగా తన ఫీలింగ్స్‌ని కొటేషన్స రూపంలోనో, ఇంకోలాగానో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునేది.
సమంత ఓ పోస్ట్ పెడితే అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చైతూని గుర్తు చేేసలా ఉంటుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తుండేవారు. మరి ఈసారి సమంత ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. చై-సమంత విడిపోయిన తరవాత కనీసం సినిమా వేడుకల్లో కూడా ఎక్కడా ఎదురుపడలేదు. ఒకరి గురించి ఒకరు నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరి జీవితం వాళ్లదే అన్నట్టు కొత్త మార్గంలో ప్రయాణించారు. మరి ఇప్పుడు కూడా సమంత అలానే ఉంటుందా? ఇది సున్నితమైన విషయం కాబట్టి దాని జోలికి వెళ్లకుండా హుందాగా ప్రవర్తిస్తుందా? లేదంటే చైతూని ఉద్దేశించి ఏమైనా మాట్లాడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.