Nidhhi Agerwal: ఆ సెల్ఫీని త్వరలోనే పోస్ట్ చేస్తా..
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:40 AM
చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ నెటిజన్లతో చిట్ ఛాట్ నిర్వహించారు. ఈసారి నెటిజన్లు ఆమెకు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ఆమె కూడా ఆసక్తికరంగానే సమాధానాలు ఇచ్చారు. నిధి-నెటిజన్ల చిట్ ఛాట్ హైలెట్స్ ఇవే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ వంటి స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తోంది గ్లామర్ డాల్ నిధి అగర్వాల్. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత సరైన హిట్ లేని నిధికి ఈ రెండు సినిమాలు ఎంతో కీలకం కానున్నాయి. ఆమె కూడా ఈ రెండు సినిమాలపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు నెటిజన్లతో ముచ్చటింగే ఈ భామ.. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. చాలా గ్యాప్ తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో తాజాగా ఆమె నెటిజన్లతో ఛాట్ చేసింది. ఈ చిట్ ఛాట్‌లో పర్సనల్, కెరీర్ విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు చెప్పుకొచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్‌కు ప్రశ్నలు పంపించేందుకు సోషల్ మీడియాలో ఆసక్తి కనబరిచారు. ఈ చాట్ ఛాట్ హైలెట్స్ చూస్తే..
Also Read-Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా
ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్‌లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్‌లో ఎంతో డెడికేషన్ ఉందని ‘ది రాజా సాబ్’ మూవీ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి అగర్వాల్ సమాధానమిచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రీసెంట్‌గా ఓ సెల్ఫీ తీసుకున్నానని, త్వరలోనే ఆ సెల్ఫీ పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు చెప్పుకొచ్చింది.
Also Read- Chitu Sobhita Marriage: చైతూ-శోభితల పెళ్లికి వస్తున్న అతిథులు వీరేనా..
మీకు తెలుగు వచ్చా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి సూటిగా సమాధానమిచ్చింది. తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు అని, కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది. రాబోయే నూతన సంవత్సరంలో తను నటించిన రెండు సినిమాలు ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయని, ఆ రెండు చిత్రాలతో నాయికగా ప్రేక్షకులకు మరింత చేరువవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. అంతేనా.. ఈ రెండు చిత్రాలతో పాటు మరో సర్‌ప్రైజింగ్ మూవీ కూడా ఉందని.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన వస్తుందని ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిందీ ఇస్మార్ట్ బ్యూటీ.