Floods: ఏపీ, తెలంగాణలకు.. ప్రభాస్, అల్లు అర్జున్ భారీ సాయం
ABN , Publish Date - Sep 04 , 2024 | 01:09 PM
రెండు తెలుగు రాష్ట్రాలలో వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరశ్రమ నుంచి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరశ్రమ నుంచి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే మంగళవారం రోజున జూ. ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), పవన్ కల్యాణ్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కథానాయిక అనన్య నాగళ్ల, యాంకర్ స్రవంతి, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, వంశీ, ఆయ్ మూవీ టీం తమవంతు సాయంగా ప్రకటించిన ఇషయం తెలిసిందే.
తాజాగా ఈ రోజు (బుధవారం) నాగు మెగాస్టార్ తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల సాయం ప్రకటించగా, అదేబాటలో అల్లు అర్జున్ కూడా తనవంతుగా రెండు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఇక ఎప్పటిలినే పాన్ ఇండియా సూపర్ స్టార్ తన పేరుకు తగ్గట్టుగానే కాష్ట్రానికి కోటి చొప్పున కెంగు కోట్ల విరాళం ప్రకటించి తన సేవాగుణాన్ని మరో సారి చాటుకున్నాడు.
అదే విధంగా కమెడియన్ అలీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.3 లక్షలు, తెలంగాణకు రూ.3 లక్షల చొప్పున రూ.6లక్షల విరాళం ప్రకటించారు. కోట శ్రినివాసరావు లక్ష సాయం ప్రకటించారు.
ఇప్పటి వరకు.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
ప్రభాస్: ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి
పవన్ కళ్యాణ్: ఏపీకి రూ. కోటి
చిరంజీవి: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
బాలకృష్ణ: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
మహేష్ బాబు: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
ఎన్టీఆర్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అల్లు అర్జున్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
విశ్వక్ సేన్: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
వెంకీ అట్లూరి: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అనన్య నాగళ్ల: ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు
యాంకర్ స్రవంతి చొక్కారపు: ఏపీకి రూ. లక్ష, తెలంగాణకు రూ. లక్ష
బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
వైజయంతీ మూవీస్: ఏపీకి రూ. 25 లక్షలు
కోట శ్రీనివాసరావు: రూ. లక్ష
అలీ: ఏపీకి రూ. 3లక్షలు, తెలంగాణకు రూ. 3లక్షలు