Sai Durgha Tej: హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:48 PM

గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న వార్త సాయి దుర్గ తేజ్ పెళ్లి. ఫలానా హీరోయిన్ తో పెళ్లి అంటూ ఇబ్బడి ముబ్బడిగా వార్తలుప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై హీరో సాయి దుర్గా తేజ్ స్పందించి ఓ క్లారిటీ ఇచ్చారు.

Sai Dharam Tej

గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న వార్త సాయి దుర్గ తేజ్ పెళ్లి. ఫలానా హీరోయిన్ తో పెళ్లి అంటూ ిబ్బడి ముబ్బడి గా వార్తలు తమ ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సదరు హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) స్పందించి ఓ క్లారిటీ ఇచ్చారు. అందుకు చాలాకాలం తర్వాత కెజ విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఉషా పరిణయం’ (Usha Parinayam) సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ వేదిక అయింది.


ఈ సందర్భంగా మీ ప్రేమ, పెళ్లి గురించి చెప్పండి అంటూ లేడీ యాంక‌ర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ల‌వ్ అంటే మీ ధృష్టిలో ఏంటి అని అడ‌గ‌గా.. అమ్మ చెప్పింది చేయ‌డం అని జ‌వాబిచ్చాడు. ఆపై ‘వన్ సైడ్‌ లవ్‌ ఉంది. ఆ అమ్మాయి నుంచి ఎలాంటి స్పందన లేదని.. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనే సమాధానం వస్తోందని అంటున్నారు. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు’ అని నవ్వుతూ రిప్లయ్‌ ఇచ్చారు. ‘త్వరలో మెగా ఇంట పెళ్లి సందడి అంటూ న్యూస్‌ వస్తోంది. మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?’ అని ప్రశ్నించగా.. ‘‘నా సినిమాలో ‘నో పెళ్లి’ (సోలో బ్రతుకే సో బెటర్‌) అనే పాట ఉంది తెలుసు కదా’ అని సమాధానమిచ్చారు.

ఇంకా.. పెళ్లి చేసుకోవాల‌నుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాల‌ని మీరు కోరుకుంటార‌ని మ‌రో ప్ర‌శ్న అడ‌గ్గా మీడియా , సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయిని, ముఖ్యంగా అమ్మ‌కు న‌చ్చాలంటూ స‌మాధాన‌మిచ్చాడు.

Updated Date - Jul 29 , 2024 | 09:27 PM