SarangaDhariya: రాజా రవీంద్ర ‘సారంగదరియా’.. ట్రైలర్ లాంచ్ చేసిన హీరో నిఖిల్

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:39 PM

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో న‌టించిన‌ చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమా జూలై 12న రిలీజ్ రానుంది. ఈక్ర‌మంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ విడుదల చేశారు.

SarangaDhariya

రాజా రవీంద్ర (Raja Raveendra) ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’ (SarangaDhariya). కాగా ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్ రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్‌, లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ ( Nikhil Siddhartha) విడుదల చేశారు.

5d542417-e598-4172-adf1-db2ffad170ab.jpeg

‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి.


16eab500-a696-473b-81b3-dcf4a132cdc9.jpeg

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను చూపించినట్టుగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో రాజా రవీంద్ర నటనను చూస్తే అందరినీ కదిలించేలా ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా, ఉపాధ్యాయుడిగా ఆయ‌న రెండు ర‌కాల పాత్ర‌ల్లో కనిపించినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్ఆర్ చక్కగా ఉన్నాయి. వినయ్ డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు (Shivakumar), యశస్విని (Yesaswini), మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు

Updated Date - Jul 05 , 2024 | 01:39 PM