Harish Shankar: పాటపై రచ్చ... హరీశ్  శంకర్‌ స్పందన

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:25 PM

రవితేజ హీరోగా  హరీశ్  శంకర్‌ దర్శకత్వం వహించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాలో సితార్‌ పాటలో ఓ డాన్స్ మూమెంట్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

రవితేజ (Ravi teja) హీరోగా  హరీశ్  శంకర్‌ (harish Shankar) దర్శకత్వం వహించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాలో సితార్‌ పాటలో (Sitar song) ఓ డాన్స్ మూమెంట్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై   హరీశ్  శంకర్‌  గురువారం జరిగిన సక్సెస్‌ మీట్‌లో మాట్లాడారు. పాటలో డ్యాన్స్‌ను ఫ్లోలో చూడాలన్నారు. స్క్రీన్  షాట్‌ తీసి దాన్ని వైరల్‌ చేస్తూ చూడొద్దని కోరారు. ‘‘ఆ పాటను షూటింగ్‌ మొదటిరోజు చిత్రీకరణ చేశాం. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ను ఫ్లోలో చూడాలి. అలాకాకుండా ఒక డ్యాన్స్‌ మూమెంట్‌ను స్క్రీన్  షాట్‌ తీసి చుస్తే  ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. దాని రిహార్సిల్స్‌ చూసినప్పుడు నాకు కూడా ఈ పాటకు స్టెప్‌ అవసరం లేదనిపించింది. కానీ, శేఖర్‌ మాస్టర్‌ చాలా పెద్ద కొరియోగ్రాఫర్‌. ఆయన కంపోజ్‌ చేసిన మొదటి మూమెంట్‌ను నేను వద్దు అనడం కరెక్ట్‌ కాదనిపించింది. అందుకే దాన్ని పాటలో ఉంచాం. సెన్సార్‌ వారు కూడా ఫ్లోలో చూశారు కాబట్టి కట్‌ చేయలేదు’’ అని హరీశ్‌ శంకర్‌ అన్నారు.

"నేను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసేది తప్పుడు కామెంట్స్‌ పెట్టే వారిని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించేవారిని మాత్రమే. నాకు  నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తన చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించాలని కోరుకోవడం అత్యాశ అవుతుందన్నారు  హరీశ్  శంకర్‌. 

Updated Date - Aug 16 , 2024 | 05:26 PM