Pawan Kalyan: నెలకి ఆరు రోజులు టైమ్‌.. ఇంకా 18 రోజులు కావాలట

ABN , Publish Date - Nov 29 , 2024 | 02:36 PM

పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేసే దిశగా నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగతా 40 శాతం చిత్రీకరణ జరుగుతోంది.

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రాన్ని మార్చి 28న విడుదల చేసే దిశగా నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగతా 40 శాతం చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుగుతోంది. మురళీశర్మ,, పలువురు బ్రిటీష్‌ పాత్రధారులు, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తదుపరి విజయవాడలో వేసిన సెట్‌లో పవన్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ప్రస్తుతం పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. దాంతో నెలలో ఆరు రోజులు మాత్రమే కాల్‌ షీట్‌ ఇస్తున్నారని తెలిసింది. ఆయన పార్ట్‌ షూట్‌ చేయడానికి ఇంకా 18 రోజులు సమయం కావాలని చిత్ర యూనిట్‌లో ఒకరు చెప్పారు. మరో పక్క తీసిన రష్‌కు పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. అయితే హైదరాబాద్‌, విజయవాడలో సెట్స్‌ వేసిన ఆలస్యంగా చేయడం నిర్మాతకు, యూనిట్‌కు కాస్త ఇబ్బందే. పైగా బడ్జెట్‌తో కూడిన పని. ఇదే ప్రశ్నను చిత్ర బృందంలో ఒకరిని అడడగా.. ఎ.ఎం.రత్నం మీదున్న అభిమానంతో పవన్‌ కల్యాణ్‌ నిర్మాణ వ్యయాన్ని బరిస్తున్నారని సమాధానం వచ్చింది. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. తాజా షెడ్యూల్‌లో దాదాపు 200మంది ఆర్టిసులు పాల్గొననున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.


HHVM-Still.jpg

చారిత్రక అంశాలతో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో పవన్‌ శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరపైకి రానుండగా.. మొదటి భాగాన్ని ‘హరి హర వీరమల్లు పార్ట్‌–1 స్వ్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్‌, అనుపమ్‌ ఖేర్‌, నాజర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ దర్శకత్వం  వహిస్తున్నారు. 

Also Read-సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 02:53 PM