Google Trends: హనుమంతుడి కోసం వెతుకుతున్న నవతరం

ABN , Publish Date - Dec 11 , 2024 | 04:34 PM

తాజాగా గూగుల్ ప్రకటించిన ట్రెండ్స్‌లోను ప్రశాంత్ వర్మ 'హనుమాన్' సంచలనం సృష్టించింది.

ఈ ఏడాది సూపర్ హీరో కాన్సెప్ట్‌కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెర‌కెక్కించిన‌ ‘హనుమాన్’ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్స్‌లో ‘హనుమాన్’ చేసిన వీరవిహారానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. ఈ రోజుల్లో ఊహ‌కంద‌ని విధంగా ఏకంగా 100 రోజులు థియేట‌ర్లలో న‌డిచి తెలుగు సినిమా సత్తా ఏంటో మ‌రోసారి చాటి చెప్పిన ఈ సినిమా మరోసంచలనం సృష్టించింది. ఈ విషయాన్నీ గూగుల్ ఇండియా సగౌరవంగా ప్రకటించింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే..


మనకు ఏ అవసరం ఉన్న గూగుల్‌నే మొదట ఆశ్రయిస్తాం. ఉదాహరణకి మనకు దగ్గరలో ఉన్న బెస్ట్ కాఫీ షాప్, రెస్టారెంట్, పెట్రోల్ బంక్, సినిమా థియేటర్. వీటికి వెనుకలో (Near me) దగ్గరలో అని యాడ్ చేస్తాము. ఈ ఏడాది పూర్తి కానుండటంతో గూగుల్ టాప్ 10 Near me సెర్చులని బయటపెట్టింది. ఈ లిస్ట్ పదోస్థానంలో "Hanuman Movie Near Me" చోటు కైవసం చేసుకుంది. ఇక మిగతా సెర్చ్‌ల విషయానికొస్తే..

AQI near me (ఎయిర్ క్వాలిటీ)

Onam Sadhya near me(ఓనం సధ్య-పండుగ విందు)

Ram Mandir near me(రామాలయం)

Sports bars near me(స్పోర్ట్స్ బార్)

Best bakery near me(బేకరీ)

Trendy cafes near me( కెఫేలు)

Polio drops near me(పోలియో చుక్కలు)

Shiv temple near me(శివాలయం)

Best coffee near me(కాఫీ షాప్)

మొదటి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి.


మరోవైపు ‘హను-మాన్’ సినిమా ఘన విజయం తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘జై హనుమాన్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కన్నడ నటుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటించనుండటం విశేషం.

Updated Date - Dec 11 , 2024 | 04:34 PM