SDGM New Movie: కాంబినేషన్  సెట్‌.. భారీ యాక్షన్  ప్రాజెక్ట్‌!

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:31 AM

టాలీవుడ్‌ దర్శకుల రూటే సెపరేట్‌ అన్నట్లు ఉంది. తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌పైనా దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడనికి సుముఖంగా ఉన్నారు

SDGM New Movie: కాంబినేషన్  సెట్‌.. భారీ యాక్షన్  ప్రాజెక్ట్‌!


టాలీవుడ్‌ దర్శకుల రూటే సెపరేట్‌ అన్నట్లు ఉంది. తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌పైనా దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడనికి సుముఖంగా  ఉన్నారు. గతేడాది 'వీరసింహారెడ్డి' (Veera Simhareddy) చిత్రంతో విజయాన్ని అందుకున్న గోపీచంద్‌ (Gopichand) మలినేని బాలీవుడ్‌లో హీరోతో సినిమా చేయబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. 'గదర్‌-2' మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో సన్నీడియోల్‌తో గోపీచంద్‌ సినిమా చేయబోతున్నారని, అందుకు రంగం సిద్ధం అయిందని వార్తలు వచ్చాయి.  అయితే ఈ సినిమా ఖరారే అని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ట్విట్టర్‌ వేదికగా అప్‌డేట్‌ ఇచ్చాయి. 

Sunny.jpg

"దేశంలోనే బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సినిమా’ అంటూ తదుపరి చిత్రం'అంటూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. అంతే కాదు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్మాత డి.సురేష్ బాబు  హీరోపై క్లాప్‌ ఇచ్చారు. అతి త్వరలో షూటింగ్‌ మొదలు కానున్న ఈ చిత్రం మాస్‌ ఫీస్ట్‌ అందించబోతుంది, దేశంలోనే అతి పెద్ద యాక్షన్  చిత్రమని చిత్ర వర్గాలు తెలిపాయి. సయామీఖేర్‌, రెజీనా నాయికలు. తమన్ సంగీతం అందిస్తున్నారు.  నవీన యెర్నేని, వై.రవిశంకర్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలు. 

MAlineni.jpg

Updated Date - Jun 20 , 2024 | 01:57 PM