Gopichand 32: హై-వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

ABN , Publish Date - Jan 27 , 2024 | 08:53 PM

మాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ హై-వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోంది. ఆయన హీరోగా నటిస్తున్న 32వ చిత్రమిది. డిస్ర్టిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ వేణు దోనేపూడి ఈ ప్రాజెక్ట్‌తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

Gopichand 32: హై-వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

మాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ హై-వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోంది. ఆయన హీరోగా నటిస్తున్న 32వ చిత్రమిది. డిస్ర్టిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ వేణు దోనేపూడి ఈ ప్రాజెక్ట్‌తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఇటలీలో ఒక షెడ్యూల్‌, గోవాలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. శనివారం గోపీచంద్‌, ఇతర తారాగణంతో హిమాలయాలలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో కీలకమైన షూటింగ్‌ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ శ్రీను వైట్ల గోపీచంద్‌ని సరికొత్తగా చూపిస్తున్నారు. ఇందులో యాక్షన్‌తో పాటు శ్రీనువైట్ల మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ చిత్రానికి గోపీ మోహన్‌  స్క్రీన్ ప్లే  అందిస్తున్నారు. కెవి గుహన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు. 


Updated Date - Jan 27 , 2024 | 08:53 PM