Ramcharan: గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు అరుదైన గుర్తింపు.. ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ర్వాత అత‌నే

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:50 PM

రామ్ చరణ్ కీర్తికిరీటాలలో మరో ఘ‌నత వచ్చి చేరింది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ర్వాత ఆ గ‌ర్తింపు మ‌న చ‌ర‌ణ్‌కే ద‌క్క‌డం విశేషం.

Ramcharan:  గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు అరుదైన గుర్తింపు.. ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ర్వాత అత‌నే
ram charan

రామ్ చరణ్ (Ram Charan) కీర్తికిరీటాలలో మరో ఘ‌నత వచ్చి చేరింది. చెన్నైలోని ప్ర‌ముఖ‌ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. దీంతో అభిమానులు ఉబ్బి త‌బ్బిబ‌వు తున్నారు.

ఏప్రిల్ 13న చెన్నైలోని పల్లవరంలో వేల్స్ వర్సిటీ (Vels University) స్నాతకోత్సవం జరగనుండ‌గా ఏఐసీటీఈ (All India Council for Technical Education ( AICTE ) అధ్యక్షుడు డీజీ సీతారాం.. రామ్ చరణ్ (Ram Charan) కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.


GK3DOmjX0AAX95Q.jpeg

ఇదిలాఉండ‌గా.. ఈ జ‌న‌వ‌రిలోనే వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ (Vels University) ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌క‌టించ‌గా ఆయ‌న నా క‌న్నా రాణించిన వారు చాలామంది ఉన్నార‌ని వారికి ఈ గౌర‌వం అంద‌జేయండి అంటూ ఆ డాక్ట‌రేట్‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు.

గ‌తంలో త‌మిళ ద‌ర్శ‌కుడు ఈ డాక్ట‌రేట్ అందుకోగా ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) కు ఈ ఘ‌న‌త ద‌క్కింది. ఏప్రిల్ 13న జ‌రిగే కాలేజీ స్నాత‌కోత్స‌వానికి రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా పాల్గొన‌నుండ‌గా అదే కార్య‌క్ర‌మంలో ఈ డాక్ట‌రేట్‌ను ప్ర‌ధానం చేయ‌నున్నారు.

Charan.jpg

Updated Date - Apr 11 , 2024 | 06:42 PM