Garikipati: అల్లు అర్జున్ ఏమైనా హరిశ్చంద్రుడా.. గరికపాటి

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:39 PM

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాపై ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆవ్యాఖ్యలు వైరల్‌గా మారాయి ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమా రిలీజ్ కి దగ్గరపడుతున్న వేళా సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. గతంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'పుష్ప' సినిమాపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..


2021లో 'పుష్ప' సినిమా రిలీజ్ అయినా టైమ్‌లో ఇలాంటి సినిమాలు సమాజానికి హానికరం అంటూ గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్‌ చూపించి. చివరలో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. ఈలోపు సమాజం‌ చెడిపొవాలా?స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి 'తగ్గేదే లే‌' అంటాడా. ఇప్పుడు అదొక ఉపనిషత్ సూక్తి అయిపోయింది. ఈ చిత్ర హీరో దర్శకుడు తనకు సమాధానం చెప్తే కడిగేస్తా. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. 'తగ్గేదే లే' అంటున్నాడు. ఈ డైలాగ్‌ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. 'తగ్గేదే లే' అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదంటూ" ఆయన మండిపడ్డారు.


అయితే అప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యి పెద్ద దుమారమే రేపాయి. గరికపాటికి సినిమా ఫ్యాన్స్‌తో సహా పలువురు సెలబ్రిటీలు కౌంటరు ఇచ్చారు. మళ్ళీ 'పుష్ప 2' రిలీజ్ నేపథ్యంలో ఈ వీడీయో రిపీటెడ్ గా షేర్ అవుతోంది.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2024 | 02:52 PM