Game Changer: 'ఆర్ఆర్ఆర్' తర్వాత మరోసారి.. చరణ్, తారక్

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:43 PM

'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. తాజాగా మరో విన్నూత ప్రచారానికి మూవీ టీమ్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమా జనవరి 10న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఆదివారం డల్లాస్‌లో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.


తాజాగా మరో విన్నూత ప్రచారానికి మూవీ టీమ్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేసేందుకు 'ఆర్ఆర్ఆర్' జోడి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా పాల్గొననున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో చరణ్, తారక్ మ్యూచ్‌వల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

GfeliJTXMAAXIR0.jpg


రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో కనిపించనున్న ఈ ‘గేమ్ చేంజర్’ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ‘జ‌ర‌గండి జ‌రగండి.. ’, ‘రా మచ్చా రా..’, ‘నా నా హైరానా’ సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ‘గేమ్ చేంజర్’ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

Updated Date - Dec 23 , 2024 | 04:46 PM