F4: ఈసారి మాములుగా ఉండదు

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:21 PM

ఫన్‌..   ఫ్రస్ట్రేషన్   అంటూ ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’లతో కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్‌ (Venkatesh) , వరుణ్‌ తేజ్‌(varun Teja). అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది.

F4: ఈసారి మాములుగా ఉండదు

ఫన్‌.. ఫ్రస్ట్రేషన్   అంటూ ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’లతో కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్‌ (Venkatesh) , వరుణ్‌ తేజ్‌(varun Teja). అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో కావలసిననంత వినోదం, పంచ్ లు  ప్రేక్షకులతో  నవ్వులు పూయించాయి.  ఇప్పుడు వీటికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్‌4’ (F4)రానుందని వార్తలు వైరల్‌ ఆవుతున్నాయి. తొలుత అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌2’ను చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో దానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్‌3’ని తెరకెక్కించారు.

ఇందులో వెంకీ, వరుణ్‌లకు తోడు సునీల్‌ కూడా చక్కని కామెడీ పంచారు. వీరికి తోడు తమన్నా, మెహరీన్  గ్లామర్‌ తోడై రెండో పార్ట్‌ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో చిత్ర నిర్మాత దిల్‌రాజు ఈ ఫన్‌ ఫ్రాంచైజీని ఇలాగే ముందుకు తీసుకెళ్తామని చెప్పడంతో ‘ఎఫ్‌4’ కూడా ఉంటుందని అభిమానులు అంచనాకు వచ్చారు. తద్వారా ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన  వార్త సోషల్‌ మీడియాలో ప్రచారమవుతోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్న ట్లు తెలుస్తోంది. సినిమా విడుదల సమయంలో అనిల్‌ రావిపూడి ఓ విషయం చెప్పారు. ఇందులో వెంకీ, వరుణ్‌తేజ్‌లతోపాటు మరో స్టార్‌ హీరో ఉంటారని స్పషం చేశారు. హీరోయిన్స్ లో కూడా మార్పు ఉంటుందని చెప్పారు. 'ఎఫ్ 3' తర్వాత బాలకృష్ణ తో  'భగవంత్ కేసరి' చిత్రం చేసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం  వెంకటేశ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్  చేస్తున్నారు. ఆ తర్వాత ‘ఎఫ్‌4’ మొదలుపెడతారని తెలిసింది. 

Updated Date - Jun 14 , 2024 | 05:55 PM