Varun Tej: ప్రధాని ఇంటికి వరుణ్ తేజ్.. నిహారిక కూడా
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:01 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాని ఇంటికి వెళ్లారు, ఆయనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇంతకీ వాళ్లంతా ప్రధాని ఇంటికి ఎందుకు వెళ్లారంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం 'మట్కా' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ మాజీ ప్రధాని ఇంటికి వెళ్లారు, ఆయనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇంతకీ వాళ్లంతా ప్రధాని ఇంటికి ఎందుకు వెళ్లారంటే..
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఫ్యామిలీ మొత్తంతో మణికొండలో నివసిస్తున్నారు. తాజాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లోనే ఒక లక్కీ హౌస్‌కి మారారు. ఆ ఇల్లు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి చెందినది. ఆయన ఈ ఇంటికి మారిన తర్వాతే ప్రధాన మంత్రి అయ్యారు. కాలక్రమేనా ఈ భవంతిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అద్దెకి తీసుకుంది. ఇందులో ఉన్నపుడే ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, సర్కారు వారి పాట చిత్రాలను నిర్మించారు. అయితే ఎందుకో మైత్రి మూవీ మేకర్స్ ఈ ఇంటిని వదిలేయడంతో.. వరుణ్ ఈ బిల్డింగ్‌ని అద్దెకు తీసుకున్నారు. నాగబాబు తన వైఫ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కూడా ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. ఈ లక్కీ హౌస్‌లోకి మారిన తర్వాత వీరి లక్ ఎలా మారనుందో వేచి చూడాల్సిందే.
దీపావళి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ ఇంటికి వచ్చారని వరుణ్ తెలిపాడు. ఆయన ఇల్లంతా తిరిగి చూసి, తన గదిని చూసినట్లు వరుణ్ అన్నాడు. ఇక ఈ ఇంటి ఇంటీరియర్స్ కోసం కోటిన్నర నుండి రెండు కోట్లు ఖర్చు పెట్టారట.