Fahadh Faasil: 9/11 దాడులకి ఫాహద్‌కి సంబంధమేంటి..
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:46 PM
సినిమాలే వద్దంటూ ఫాహద్ ఫాజిల్ దేశం విడిచి వెళ్లారని మీకు తెలుసా? మళ్ళీ ఆయన ఇండియాకు ఎందుకు వచ్చారు? 9/11 దాడులతో సంబంధమేంటో మీకు తెలుసా?
ప్రతి ఇండస్ట్రీలోనూ చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించి పెద్ద హీరోగా ఎదిగిన వాళ్లు చాలా మందే ఉంటారు. చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అసలు పూర్తి స్థాయిలో ఇండస్ట్రీకి దూరమై తిరిగి వచ్చి సత్తా చాటుకున్న హీరోలు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకడు. తండ్రి ఫాజిల్ ఒక స్టార్ డైరెక్టర్ అవ్వడంతో ఆ ప్రభావం ఫాహద్ ఫాజిల్ మీద పడింది. 20 ఏళ్ల వయసులోనే 'కైయేతుం దూరత్' అనే లవ్ ఓరియెంటెడ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫస్ట్ సినిమానే కమర్షియల్ డిజాస్టర్ అవ్వడంతో ఫాహిద్ కు సినిమాల మీద ఆసక్తి పోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫారిన్ వెళ్లిపోయాడు.
కట్ చేస్తే 9/11 దాడుల ఉదంతంతో తెరకెక్కిన 'యు హో తా తో క్యా హోతా' అనే సినిమా ఫాహద్ మైండ్ సెట్‌ను మార్చేసిందట. ఉగ్రదాడుల వల్ల ఆరుగురి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఇన్‌స్పిరేషన్తో ఫాహద్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆతరువాత నటుడిగా యాక్టింగ్ కోర్సును పూర్తి చేసి కేరళ కేఫ్ అనే మూవీతో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఏడేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఫాహద్ సైడ్ క్యారక్టర్‌గా, సపోర్టింగ్ రోల్స్ లో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, ఆ తరువాత మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యాడు. హీరోకు ఉండాల్సిన మినిమమ్ క్వాలిటీస్ ఏవీ ఫాహద్‌కు లేవని కెరీర్ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నా, ఆ తరువాత తన నటనతో ఆ ట్రాక్‌ను తప్పించి క్రేజ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఫాహద్ ఫాజిల్ ను ముద్దుగా ఆయన ఫ్యాన్స్ ఫాఫాగా పిలుచుకుంటున్నారు. తెలుగులో పుష్ప సినిమాతో పూర్తి స్థాయి నెగిటివ్ రోల్ చేసిన ఫాహద్‌కు, ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక తమిళంలో చేసిన విక్రమ్, వేట్టయాన్ చిత్రాలు కూడా ఫాహద్‌కు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్ గా ఆవేశం సినిమాతో మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకున్నాడు. ఫాఫా కు ఇండియన్ వైడ్‌గా ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో, ఆవేశం చిత్రంను చూస్తేనే తెలుస్తుంది. బిగ్ స్క్రీన్ మీదే కాకుండా ఓటీటీలోనూ ఫాపా కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు, మనోడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో.. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్ పుష్ప-2తో అలరించనున్నాడు. ఫాహద్ లాంటి విలక్షణ నటులను ఎంకరేజ్ చేస్తూ తెర మీద ఇంకా మరిన్ని అద్భుతమైన కథలు సినిమాలు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.