Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ నటన.. ఫ్రెంచ్ హీరో ఏమన్నారంటే!

ABN , Publish Date - Aug 16 , 2024 | 10:51 AM

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఈ సినిమాతో హీరోలు రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌లకు గ్లోబల్‌ స్టాయిలో గుర్తింపు వచ్చింది.

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఈ సినిమాతో హీరోలు రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌లకు గ్లోబల్‌ స్టాయిలో గుర్తింపు వచ్చింది. చిత్రంలో వీరిద్దరి నటనను పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు సైతం ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫ్రెంచ్‌ హీరో లుకాస్‌ బ్రావో(Lucas Bravo).. రామ్‌ చరణ్‌ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను ఆయన అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఎక్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, రామ్‌చరణ్‌ పేర్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో హీరో రామ్‌ చరణ్‌ నటన అద్భుతం. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నారు’’ అని ప్రశంసించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. 2022లో విడుదలై రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. తెలుగు సినిమాకు తొలి ఆస్కార్‌ను తీసుకొచ్చింది. పలు అంతర్జీతీయ అవార్డులను అందుకొంది. 


ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ 'ఛేంజర్‌’తో చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రామ్‌ చరణ్‌ డ్యూయెల్‌ రోల్‌లో కనిపిస్తారని టాక్‌ నడుస్తోంది. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు రామ్ఆ చరణ్ కు ఆహ్వానం అందింది. దీనికోసం అయన తన కుటుంబంతో గురువారం మెల్‌బోర్న్‌ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగే ఈ చలనచిత్రోత్సవంలో ఇండియన్‌  ఆర్ట్స్  అండ్‌ కల్చర్‌ అంబాసిడర్‌ పురస్కారాన్ని రామ్‌చరణ్‌ అందుకోనున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 10:58 AM