Kannappa: ‘కన్నప్ప’ నుంచి.. తిన్న‌డు స్నేహితుడు ‘టిక్కి’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Sep 16 , 2024 | 06:00 PM

విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా తిన్నడికి అత్యంత విధేయుడైన స్నేహితుడు.. టిక్కిని పరిచయం చేశారు.

Kannappa

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa Movie) నుంచి ప్రతీ సోమవారం విడుద‌ల చేస్తున్న‌ అప్డేట్ రోజురోజుకు సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ క‌న్నప్ప మూవీలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు రిలీజ్ చేయ‌గా అవ‌న్నీ క్యూరియాసిటీని పెంచాయి. ఇక గత సోమవారం అక్షయ్ కుమార్ శివుడి పాత్రకు సంబంధించి ప్రీ లుక్‌ను విడుదల చేశారు.

GXlpSdwbgAAoGcN.jpeg

తాజాగా ఈ సోమవారం కన్నప్ప (Kannappa Movie) నుంచి విష్ణు మంచు (Vishnu Manchu) మ‌రో స్ట‌న్నింగ్‌ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తిన్నడికి అత్యంత విధేయుడైన స్నేహితుడు.. టిక్కి ( TIKKI)ని పరిచయం చేశారు. అయితే ఆ స్నేహితుడు గుర్రం కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈ గుర్రంకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఈ పోస్టర్‌లో గుర్రంపై విష్ణు మంచు లుక్ అదిరిపోయేలా ఉంది.

GXlpShAbkAAtJME.jpeg

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohanbabu) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహింస్తున్నారు. ఇప్పటికే రిలీజైన‌ కన్నప్ప టీజర్‌ సినిమా మీద భారీ అంచనాలను పెంచ‌గా డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - Sep 16 , 2024 | 06:00 PM