Mr Celebrity: అక్టోబర్ 4న థియేట‌ర్ల‌లోకి.. పుకార్ల‌పై పోరాటం ‘మిస్టర్ సెలెబ్రిటీ’

ABN , Publish Date - Sep 26 , 2024 | 07:35 PM

పరుచూరి వెంకటేశ్వరరావు మ‌నుమ‌డు సుదర్శన్ పరుచూరి హీరోగా వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

Mr Celebrity

ప్రస్తుతం కొత్త కాన్సెప్టులనే ఆడియెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవతరం తీస్తున్న చిత్రాలకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే పరుచూరి వెంకటేశ్వరరావు మ‌నుమ‌డు సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri) ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr. Celebrity) అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్‌పై చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ (Chandina Ravi Kishore) దర్శకత్వం వహించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించారు.

Mr Celebrity

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర్ణ‌ను ద‌క్కించుకోగా సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ‘రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకారు మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ సాగే డైలాగ్స్ాక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రానుందని ప్రకటించారు.

Mr Celebrity

ఈ సంద‌ర్భంగా పరుచూరి బ్ర‌ద‌ర్స్‌ మాట్లాడుతూ.. ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్ 4న తప్పకుండా మిస్టర్ సెలెబ్రిటీ సినిమాను చూడండి’ అని కోరారు.

Mr Celebrity

Updated Date - Sep 26 , 2024 | 07:35 PM