NagaBabu: ఒక మహావృక్షానికి సపోర్ట్‌ అవసరమా?

ABN , Publish Date - Aug 05 , 2024 | 08:58 PM

కొంత గ్యాప్‌ తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు కొణిదెల (Nagababu) ఇన్స్టా గ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.  నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

కొంత గ్యాప్‌ తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు కొణిదెల (Nagababu) ఇన్స్టా గ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.  నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రామ్‌చరణ్‌తోపాటు సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై మీరు సినిమాలు చేయరా అన్న ప్రశ్నకు 'ఒకప్పుడు పెద్దగా చేసింది లేదు. ఇప్పుడు చేయకపోయినా పోయేదేమీ లేదు’ అని జవాబిచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్కమాటలో?

కొణిదెల పవన్‌ కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అయ్యారుు కదా? సినిమాలు కంటిన్యూ చేస్తారా? లేదా?
అదీ ఉండాలి.. దాంతోపాటు ఇదీ ఉండాలి.

మీరు ఎంపీ లేదా ఎమ్మెల్యే అవుతారనుకున్నాం?
సరే సర్లే.. అన్ని జరుగుతాయా ఏంటి.

టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మీరేలా ఫీలయ్యారు?
చక్కగా 11 మంది బాగా ఆడుతుంటే వరల్డ్‌కప్‌ ఏంటి ఏ మ్యాచ్‌ అయినా ఎంజాయ్‌ చేయొచ్చు.

జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్  సొంతం చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది?

మాటల్లో చెప్పలేను.


లావణ్య గురించి ఒక్కమాటలో?

వినయం, మంచి మనసు ఉన్న మనిషి.

పవన్‌కల్యాణ్‌కు సపోర్ట్‌గా ఉన్నందుకు థ్యాంక్యూ..!

ఒక మహావృక్షానికి సపోర్ట్‌ అవసరమా?

జనసేనలో మీరు కష్టపడినంత ఎవరూ కష్టపడలేదు?

ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం చెబుతా. మా జనసేనాని, జన సైనికులు, వీర మహిళలు పడిన కష్టంలో నా వంతు కేవలం 0000001 శాతం మాత్రం.

పవన్‌కల్యాణ్‌ను ఎలా కలవాలి?
విజయవాడకు దగ్గరలో మంగళగిరి ఉంటుంది. అక్కడికి వెళ్లి పవన్‌కల్యాణ్‌ ఇల్లు ఎక్కడ అని అడుగు. వాళ్లు అడ్రస్‌ చెబుతారు. ఇంటికి వెళ్లి కలిసిరా. ఈ విషయం నేను చెప్పానని పవన్‌కల్యాణ్‌కు చెప్పకు మళ్లీ నాకు మాట వస్తది.

అల్లు అర్జున్‌ గురించి ఏమైనా?
శ్రమపడే తత్వం కలిగిన వ్యక్తి. పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నా.

మీ అభిమాన హీరో ఎవరు?
మా అన్నయ్య, తమ్ముడు. మా తర్వాత తరం. తలైవా, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌.. ఇలా చెబుతా వెళ్తే చాలా పేర్లు ఉన్నాయి.

అకీరా, నిహారికపై మీ అభిప్రాయం?

మర్యాద, సైలెంట్‌, ప్రేమించే మనస్తత్వం కలిగిన వాడు. నిహారిక నా దేవత.

యూట్యూబ్‌ ఛానల్స్‌పై స్ట్రైక్ వేస్తున్నారు. దానిపై మీ కామెంట్‌?

నాది Nagababu official ఛానల్‌ పోయింది.  

మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?

పవన్‌కల్యాణ్‌.. వందశాతం స్ట్రైక్ రేట్

ఇప్పటివరకూ మీరు యాక్ట్‌ చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన పాత్ర ఏమిటి?
బావగారు బాగున్నారాలో రంభను ఎత్తుకునే సీన్‌ని ఉద్దేశించి.. ఇది అయితే కాదు. ఎందుకంటే ఈ సీన్‌ తర్వాత నడుం పట్టేసింది.

లా ప్రాక్టీస్‌ చేశారా?
లా ప్రాక్టీస్‌ చేద్దామనుకున్నా. ఈలోగా ఎంబీఏ ట్రై చేశా. అంతలోనే నిర్మాత అవుదామనుకున్నా. యాక్టింగ్‌ ప్రయత్నించా. ఆయా రంగాల్లో సెటిల్‌ అయ్యేలోపు రాజకీయాల్లోకి వచ్చా. ఇప్పుడు అవేమీ కాకుండా మీమర్‌గా మారి మీమ్స్‌ వేసుకుంటున్నా.

Updated Date - Aug 05 , 2024 | 08:58 PM