Fahadh Faasil: పారితోషికం.. ఆ విషయం నాకూ తెలీదు!
ABN , Publish Date - May 09 , 2024 | 10:24 AM
'ఒకటి తగ్గింది పుష్ప’ (Pushpa) అంటూ తనదైన శైలి నటనతో అలరించారు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) . అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప పార్ట్ -1'లో భన్వర్‌సింగ్ షెకావత్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం సిద్ధమవుతోన్న ‘పుష్ప2’లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
'ఒకటి తగ్గింది పుష్ప’ (Pushpa) అంటూ తనదైన శైలి నటనతో అలరించారు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) . అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప పార్ట్ -1'లో భన్వర్‌సింగ్ షెకావత్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం సిద్ధమవుతోన్న ‘పుష్ప2’లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మరింత బలంగా ఆయన పాత్ర ఉండబోతోందని చిత్ర బృందం ఇప్పటికే చెప్పింది. పుష్పరాజ్(Allu arjun), భన్వర్ సింగ్ షెకావత మధ్య సన్నివేశాలు ధీటుగా ఉంటాయని టాక్ నడుస్తోంది. తాజాగా ఫహద్ ఫాజిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్సుకొచ్చారు.
‘‘జీవితానికి డబ్బు అనేది అవసరం. కానీ అదే జీవితం కాదు. ప్రతి దానికి అదొక ఒక కారణం.నేను ఇంటి నుంచి బయటకు వచ్చి చేసే పని ఏదైనా నాలో ఉత్సాహం ఇచ్చేదిగా ఉండాలి. సుకుమార్ సర్‌తో కలిసి పనిచేయడం నిజంగా ఆనందంగా ఉంది. భన్వర్‌సింగ్ పాత్రకు ఎవరైతే సరిపోతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను సినిమాలో ఉన్నా. మేమంతా కలిసి ఒక భారీ ఇండియన్ కమర్షియల్ ఫిల్మ్ చేస్తున్నాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నేను సినిమా సెట్‌కు వెళ్తాను. ‘పుష్ప’ టీమ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నేనూ ఎంతో ఆస్వాదిస్తున్నానో ఆ పాత్రను. కానీ, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్‌ను అవుతానో, లేదో మాత్రం నాకు తెలియదు. కేవలం డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదు. ‘కుంబలంగి' నైట్స్’, ‘ట్రాన్స్’ సినిమాలతో చాలానే సంపాదించా. నటన ద్వారా డబ్బులు సంపాదించాలని నేను అనుకోవడం లేదు. 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చా. ఇది అనిశ్చితి కలిగిన బిజినెస్. ఆర్థిక అస్థిరత్వాన్ని నేను సమర్థంగా ఎదుర్కోగలను. కేవలం రెండు సినిమాలని చేసి వెళ్లిపోవాలనుకున్నా. ఆ తర్వాత వచ్చినందతా బోనసే’’ అని అన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.