HBD Jagapathi Babu: ఆ ఫొటో షూట్‌తో మళ్లీ మలుపు తిరిగింది!
ABN , Publish Date - Feb 12 , 2024 | 12:58 PM
‘స్టార్‌డమ్, ఇమేజ్’ అనే చట్రానికి దూరంగా ఉండే నటుల్లో జగపతిబాబు ఒకరు. 'నేను హీరోని.. హీరో క్యారెక్టర్లే చేస్తాను.. వేరే పాత్రలు పోషించను’ అని అనుకుంటే జైల్లో ఉన్నట్లే ఉంటుంది’’ అని జగపతిబాబు ఎన్సో సందర్భాల్లో చెప్పారు.
‘స్టార్‌డమ్, ఇమేజ్’ అనే చట్రానికి దూరంగా ఉండే నటుల్లో జగపతిబాబు (jagapathibabu) ఒకరు. 'నేను హీరోని.. హీరో క్యారెక్టర్లే చేస్తాను.. వేరే పాత్రలు పోషించను’ అని అనుకుంటే జైల్లో ఉన్నట్లే ఉంటుంది’’ అని జగపతిబాబు ఎన్సో సందర్భాల్లో చెప్పారు. ‘మంచి మనుషులు’ సినిమాతో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో సింహ స్వప్నం(1989)తో హీరోగా మారారు. పెద్దరికం, అల్లరి ప్రేమికుడు, ‘శుభలగ్నం’, ‘శుభాకాంక్షలు’, ‘పెళ్లి పందిరి’, ‘మావిడాకులు’, ‘పెళ్లి పీటలు’ హనుమాన్ జంక్షన్ వంటి ఫ్యామిలీ చిత్రాలతోపాటు ‘మనోహరం’, అంత:పురం, ‘గాయం’ వంటి యాక్షన సినిమాలతోనూ మెప్పించారు. హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ఆయన కొంతకాలం విరామం తీసుకున్నారు. ‘లెజెండ్’తో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇమేజ్ చట్రానికి దూరంగా ఉండే ఆయన ప్రస్తుతం విలనగా, క్యారెక్టర్ ఆర్టిస్‌గా బిజీగా ఉన్నారు. సెకండ్ఆ ఇన్నింగ్స్ లో ఆయనకు ప్రతినాయకుడిగా అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..
‘నేను హీరోని.. హీరో పాత్రలే చేస్తాను వేరే పాత్రలు చేయను అని కూర్చుంటే జైల్లో ఉన్నట్టే అని జగపతిబాబు పలు సందర్భాల్లో చెప్పారు. ‘ఇక కథానాయకుడిగా చేసింది చాలు కథా బలమున్న చిత్రాల్లో మంచి పాత్ర వచ్చినా చేద్దాం’ అని ఫిక్స్ అయిన తరుణంలో ఆయా అవకాశాల కోసం ఆయన ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే ఒక్క ఛాన్స్ కూడా ఆయన తలుపు తట్టలేదు. దాంతో కొన్నాళ్లు ఖాళీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఎలాంటి మాటలు వినిపిస్తాయో తెలిసిందే. జగపతిబాబుకి అవకాశాల్లేవంట.. ఇంట్లోనే కూర్చుంటున్నాడు’ అంటూ గుసగుసలాడుకోవడం ఆయన చెవిన పడింది. అదే సమయంలో ఓ మిత్రుడి సలహాతో ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్‌లో ఫొటోషూట్‌లో చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి దర్శకుడు బోయపాటి శ్రీను దృష్టిని ఆకర్షించాయి.
దాంతో, ‘లెజెండ్’లో విలన్ క్యారెక్టర్‌కు బాగా సెట్ అవుతారనే ఉద్దేశంతో జగపతి బాబును సంప్రదించారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో పచ్చ జెండా ఊపారు. ప్రతినాయకుడిగా తొలి చిత్రమే ఆయనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. దానికి ఆశించిన దానికంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారని కూడా జగపతి బాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాగే ఆ ఫొటోషూట్ ఐడియా ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పారు.
ఆయన విలన్ గా నటించిన లెజెండ్ సినిమా ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రం జగపతి కెరీర్ టర్న్ చేసింది. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యారు జగ్గూభాయ్. ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో ’ చిత్రాల్లో రిచ్ ఫాదర్‌గా, ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్‌గా భూపతిగా మాస్ రోల్‌లో మెప్పించారు. ‘మహర్షి’, ‘అఖండ’, ‘సలార్’ చిత్రాలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.