Chaitu Sobhita Wedding: ఆ వార్తలు అబద్దం.. నయనతారలా కాదు

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:12 PM

నాగ చైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి సమయం దగ్గరపడుతున్న వేళా కొన్ని ఫేక్ న్యూస్ నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఏమన్నారంటే..

అక్కినేని కుటుంబంలో మళ్ళీ పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. ఇటీవల అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. పెళ్ళికి ఇంకా పదిరోజులు కూడా లేకపోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు పనులు వేగవంతం చేశారు. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా జరిగే ఈ వేడుకను నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీరి వివాహంపై పలు ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ వార్తలు ఏంటంటే..


ఇటీవల నటి నయనతార-విగ్నేష్ ల పెళ్లి వేడుకలను నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీల స్ట్రీమ్ చేశారు. అది నయనతారకి నాలుగవ రిలేషన్‌షిప్ కాగా విగ్నేష్ కి రెండవ రిలేషన్ షిప్ అయినా ఓటీటీలో స్ట్రీమ్ చేయడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య కూడా విడాకుల అనంతరం రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పెళ్లిని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ.. ఆ వార్తల్లో నిజం లేదని అక్కినేని వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఈ పెళ్లిని ప్రైవేట్ గా, అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహిస్తారని తెలిపారు.

N_Ag_7a003c32ff (1).jpg


మరోవైపు తనకు కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్కినేని నాగచైతన్య. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందన్నారు. ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానని అన్నారు. ‘‘మా పెళ్లి చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్థంగా జరగనుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు చోటు లేదు. ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్‌ లిస్ట్‌, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. తనకు నేనెంతో కనెక్ట్‌ అయ్యా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నా’’ అని అన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 03:51 PM