MAD Square: నవ్వుల 'సునామీ'కి ఏడాది.. అప్పుడే మరో అప్డేట్

ABN , Publish Date - Oct 06 , 2024 | 01:37 PM

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా రూపొందుకుంటున్న విషయం తెలిసిందే. నేటితో ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తవుతుండటంతో మూవీ యూనిట్ ఫ్యాన్స్‌కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే..

mad square poster

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) ఎప్పుడూ ముందుంటుంది. గ‌త సంవ‌త్స‌రం యంగ్ యాక్టర్స్, టాలెంటెడ్ టెక్నీషియన్స్‌తో ఈ సంస్థ‌ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nitin) ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా రూపొందుకుంటున్న విషయం తెలిసిందే. నేటితో ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తవుతుండటంతో మూవీ యూనిట్ ఫ్యాన్స్‌కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే..


ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వారి వేషధారణ, శైలి మొదటి భాగానికి భిన్నంగా ఉంది. మ్యాడ్ గ్యాంగ్‌ను సరికొత్తగా పరిచయం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే సినిమా బృందం సెకండ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మ్యాడ్ గ్యాంగ్ ఎయిర్పోర్ట్‌లో గోవా వెళ్తున్నట్లు చూపించారు. దీంతో ఈ సారి ఎంటర్టైన్మెంట్ డబుల్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ మ్యాడ్ మ్యూజిక్‌తో రచ్చరేపిన ఈ మూవీ సాంగ్స్ ఈ సారి 'లడ్డు గాడి మ్యారేజి' అంటూ విడుదల చేసిన ఓ సాంగ్ కూడా మంచి ఆదరణ పొందింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.


అందరూ మెచ్చుకునేలా 'మ్యాడ్' (MAD)చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగం 'మ్యాడ్ స్క్వేర్‌' (MAD Square)ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది.శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.'మ్యాడ్' కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండ‌గా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2024 | 01:37 PM