Andhra Pradesh: సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Sep 29 , 2024 | 09:17 PM
కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని సినీ ప్రేక్షకులు హైదరాబాద్‌లోని ప్రసాద్ IMAX మాదిరిగానే భారీ స్క్రీన్ థియేట్రికల్ అనుభవం కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలోనే సినీ ప్రేమికులు మరియు పిచ్చోళ్ళు ఎక్కువ. అలాంటి వారందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్ వచ్చేసింది. అదేంటంటే..
కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని సినీ ప్రేక్షకులు హైదరాబాద్‌లోని ప్రసాద్ IMAX మాదిరిగానే భారీ స్క్రీన్ థియేట్రికల్ అనుభవం కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలోనే సినీ ప్రేమికులు మరియు పిచ్చోళ్ళు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీలోని సినీ అభిమానులకు లులూ గ్రూప్ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడంలో భాగంగా తీరప్రాంత నగరమైన విశాఖపట్నంలో 8-స్క్రీన్ మల్టీప్లెక్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో IMAX కోసం వెయిట్ చేస్తున్న సినీ ప్రేమికుల చిరకాల వాంఛ నెరవేరనుంది.
Also Read- Megha Akash Couple: రాహుల్ గాంధీని కలిసిన మేఘా ఆకాష్ దంపతులు
గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పెట్టుబడి విధానాలతో లులూ గ్రూప్ ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు సుముఖత చూపెట్టలేదు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యూసఫ్ ఆలీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రస్తుతం వైజాగ్‌లో ప్రీమియం షాపింగ్ మాల్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే తిరుపతి, విజయవాడలలో హైపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు.
సినీ హీరోలను ఫ్యామిలీ, దేవుళ్లతో పోల్చే సంస్కృతి ఉన్న ఏపీలో ఈ నిర్ణయంతో సినిమాభిమానులు హర్షం వ్యక్తం చేస్తునారు. ఇన్ని రోజులు ఇలాంటి థియేటర్లు లేక అవతార్, బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయామని ఇప్పుడు ఆ లోటు తీరనుందని సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కూడా అన్ని అనుమతులు కల్పిస్తామని తెలుపుతూ లులూని ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యూసఫ్ ఆలీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంను గుర్తు చేసుకుంటూ.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.