Eagle: ఈగల్ టీమ్ కీలక నిర్ణయం.. అందరికీ అందుబాటులో ఉండాలనే..
ABN , Publish Date - Feb 06 , 2024 | 05:15 PM
సంక్రాంతి బరిలో విడుదల కావలసిన రవితేజ (Ravi teja) ‘ఈగల్’ (Eagle)సినీ పరిశ్రమ, నిర్మాత బాగుకోరి సంక్రాంతి పోటీ నుంచి తప్పుకొంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి బరిలో విడుదల కావలసిన రవితేజ (Ravi teja) ‘ఈగల్’ (Eagle).. సినీ పరిశ్రమ, నిర్మాతల బాగుకోరి సంక్రాంతి పోటీ నుండి తప్పుకొంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమా పరమేశ్వరన్, కావ్యా తాపర్ నాయికలు. సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర హీరోల చిత్రాలు విడుదల ఉంటే టికెట్ ధరలు పెంచుతుంటారు. కానీ అందుకు భిన్నంగా ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉండేలా ఈ చిత్ర బృందం టికెట్ ధరలను తగ్గించింది.
తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.150కే ‘ఈగల్’ మూవీ టికెట్ ధరలను పరిమితం చేసింది. అత్యధికంగా మల్లీప్లెక్స్‌లలో ధర రూ.295 నిర్ణయించే అవకాశం ఉన్నా, సినిమా ఎక్కువమందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో టికెట్ రూ.200 మాత్రమే చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం కావడంతో చాలా మంది సినిమాలకు దూరంగా ఉంటారు. తమ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
రవితేజ వీడియో వైరల్..
తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. రవితేజతో పాటు, చిత్ర బృందం కలిసి ఈ సినిమాను చూసింది. కార్తిక్ ఘట్టమనేని టేకింగ్‌పై రవితేజ సంతృప్తి వ్యక్తం చేశారు. స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు, చిత్ర నిర్మాతలకు రవితేజ శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియోలో రవితేజ హుషారు చూస్తే సినిమాపై బలమైన నమ్మకంతో ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.