Esther Anil: దృశ్యం పాప.. ఎక్కడా తగ్గేదే లే
ABN , Publish Date - Oct 30 , 2024 | 07:08 AM
దృశ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ చిన్నది ఎస్తర్ అనీల్ అప్పుడే సినిమాల్లోకి వచ్చి 14 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పాతిక పైనే చిత్రాల్లో నటించిన ఈ చిన్నది తాజాగా ఓ తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
దృశ్యం సినిమాల్లో మళయాలంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్‌కు చిన్న కూతురిగా నటించి అందరిని మెప్పించిన బాల నటి ఎస్తర్ అనీల్ (Esther Anil). 2010లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అప్పుడే సినిమా రంగంలో 14 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరోయిన్గా ఏడాదికి ఓకటి రెండు సినమాలు చేస్తున్న ఈ ముద్దగుమ్మ మరోవైపు తన చదువును కొనసాగిస్తోంది.
ముఖ్యంగా దశాబ్ద క్రితం వచ్చిన దృశ్యం మూవీ ఎస్తర్ జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్ అయి సౌత్ అన్ని ఇండస్ట్రీల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో హీరోలకు చిన్న కూతురిగా భయం భయంగా ఉంటూ తండ్రి చెప్పిన మాటలే చెప్పి అద్భుత నటన ప్రదర్శించి ఫ్యామిలీ ఆడియెన్స్‌ల్లో మంచి మార్కులు కొట్టేసింది.
ఇప్పటి వరకు పాతిక పైనే చిత్రాల్లో నటించిన ఈ చిన్నది తెలుగులో వచ్చిన జోహార్ అనే సినిమాతో కథానాయిక మారింది. లేటెస్ట్గా తెలుగులో మరో చిత్రం చేస్తోంది.
గత నెలలో మిన్మిని అనే తమిళ చిత్రంలో హీరోయిన్గా ఆరంగేట్రం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది మంచి ఆదరణనే దక్కించుకుంది. ఈ మధ్య ఎస్తర్‌కు సినిమాలు తక్కువగా ఉన్నా కేరళలో పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ప్రమోషన్ కార్యక్రమాలతో చేతినిండా పనితో బిజీగా ఉంటోంది.
సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ దుస్తుల విషయంలో మాత్రం వయస్సుకు సంబంధం లేకుండా చాలా పొదుపు పాటిస్తోంది. సమయం లభిస్తే చాలు విహారయాత్రలు చేస్తూ తన అందాలను వడ్డీ వారుస్తోంది.
ఆపై కురచ దుస్తులలో, టూ పీస్ బికినీ ఫొటోలతో కుర్రకారు మతులు పొగొడుతోంది. అంతేగాక ఆ ఫొటో షూట్లను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాలో పోస్టు చేస్తూ కాక రేపుతోంది.
తాజాగా ఆ చిత్రాలను చూస్తున్న జనం మనం చూసేది దృశ్యంలో నటించిన ఆ పాపేనా.. మరి ఇంతలా మారిందేంటి.. ఈ వయస్సులోనే ఇంతలా టాలెంట్ చూపిస్తుందేంటంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపై ఆఫర్స్ లైన్ కడతాయంటున్నారు.