Esther Anil: దృశ్యం చిన్నది.. దుస్తుల్లో ఇంత పొదుపా! మరి ఇంతలానా
ABN , Publish Date - Apr 04 , 2024 | 07:33 PM
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించి అందరిని మెప్పించిన బాల నటి ఎస్తర్ అనీల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ దుస్తుల విషయంలో చాలా పొదుపు పాటిస్తోంది.
దశాబ్ద క్రితం మలయాళంలో రూపొంది, తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి కూడా అనువాదమై మంచి విజయం సాధించి సెన్షేషన్ సృష్టించిన చిత్రం దృశ్యం.
ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించి అందరిని మెప్పించిన బాల నటి ఎస్తర్ అనీల్. ఆ సినిమాలో భయం భయంగా ఉంటూ తండ్రి చెప్పిన మాటలే చెప్పి అద్భుత నటన ప్రదర్శించి ఫ్యామిలీ ఆడియెన్స్‌ల్లో మంచి మార్కులు కొట్టేసింది.
తెలుగు, మలయాళ, తమిళ భాషల్లోనూ ఆ పాత్రను ఎస్తరే చేయడం అరుదైన విషయం. ఆ తర్వాత.. దృశ్యం 2 సినిమాలోను వెంకటేష్ చిన్న కూతురిగా మరో మారు నటించింది.
2010లో నల్లవన్ అనే మలయాళ సినిమాలో బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ ఇప్పటి వరకు పాతిక పైనే చిత్రాల్లో నటించింది. దృశ్యం తర్వాత తెలుగులో వచ్చిన జోహార్ అనే సినిమాతో కథానాయిక మారింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఎస్తర్ దుస్తుల విషయంలో మాత్రం వయస్సుకు సంబంధం లేకుండా చాలా పొదుపు పాటిస్తూ వస్తోంది. తరచూ హాట్‌హాట్‌గా ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మతులు పొగొడుతోంది. అదేవిధంగా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది.
ఆపై కురచ దుస్తులలో అమ్మడు చేసే ఫొటో షూట్లు ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాలో పోస్టు చేస్తూ యూత్‌లో కాక రేపుతోంది. ఆ ఫొటోలను చూస్తున్న జనం మనం చూసేది దృశ్యంలో నటించిన ఆ పాపేనా.. మరి ఇంతలా మారిపోయిందేంటి.. ఈ వయస్సులోనే ఇంతలా రెచ్చిపోతోందేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాలు చుట్టొస్తూ.. ఎంజాయ్ చేసే ఈ భామ.. తాజాగా తెలుగులో నేను లోకల్, థమాకా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు నిర్మాతగా మారి నక్కిన నేరేటివ్స్ బ్యానర్ పై తీస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. సో.. అమ్మడు తన కేరీర్‌లో మంచి విజయాలతో స్టార్ స్టేటస్ సాధించాలని కొరుకుంటూ.. ఆల్ ది బెస్ట్.