Double Ismart:  పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత వేగంగా అయినా వెళ్తుంది 

ABN , Publish Date - Aug 11 , 2024 | 10:13 PM

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ (Puri Jaganadh) డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' (Double ISmart) సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ (Puri Jaganadh) డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' (Double ISmart) సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్ లో'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

రామ్ పోతినేని మాట్లాడుతూ "ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వరంగల్  వచ్చాం, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా వుంది. మణిశర్మ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు, ఇస్మార్ట్ శంకర్ కి మించి చేశారు. స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాయి. సంజయ్ దత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. కావ్య చాలా మంచి అమ్మాయి.చాలా హార్డ్ వర్క్ చేసింది.  చార్మి గారు ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు. పూరి గారితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. పూరిగారు మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరి గారి చూసి స్ఫూర్తి పొందే వస్తారు. పూరి గారు గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్ గా అయినా వెళ్తుంది. పూరి గారు లాంటి గన్ అందరి యాక్టర్స్ కి కావాలి.  డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు" అని అన్నారు
Doble.jpeg

పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ.. "డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది, అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇవన్నీ తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు.  సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్ ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా చేసింది.  రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. అలీ గారి గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ గారి  ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.  ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్ లో చాలా హార్డ్ టైమ్స్ వుంటాయి. అన్నీట్లో తను నిల్చుంది. నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద వున్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని వుంటాడు. రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తారు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా అని అడిగారు. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాల ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి వున్న ప్రేమ అభిమానంతో చేశారు. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త వొళ్ళు దగ్గరపెట్టుకొని తీసిన ఆయన్ని కలుద్దామని చెప్పలేదు.   సినిమా మా అందరికీ బ్లాక్ బస్టర్ కావాలి" అని  అన్నారు.

నిర్మాత ఛార్మి మాట్లాడుతూ "ఇస్మార్ట్ శంకర్ కి ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తీస్తే ఇక్కడే ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తామని చెప్పాం.  ఇస్మార్ట్ శంకర్ ని చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 15న మీ ముందుకు రాబోతోంది. పాటలు పెద్ద హిట్ చేశారు, ట్రైలర్ రెస్పాన్స్ చాలా బావుంది" అన్నారు.


హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ " ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో జన్నత్ లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరిగారికి చాలా థాంక్ యూ. ఛార్మి గారు చాలా కేరింగ్ చూసుకున్నారు. రామ్ గారితో కలిసిపని చేయడం హానర్. మార్ ముంత చోడ్ చింతా, స్టెప్పా మార్ లాంటి పాటలు చేయడం బ్లెస్సింగ్" అన్నారు 
   

Updated Date - Aug 11 , 2024 | 10:13 PM