Imanvi: ప్రభాస్‌ హీరోయిన్.. ఇమాన్వీ గురించి ఈ విషయాలు  తెలుసా!

ABN , Publish Date - Aug 17 , 2024 | 07:11 PM

ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ (Imanvi) ఎస్మాయిల్‌ నటిస్తోంది.


ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ (Imanvi) ఎస్మాయిల్‌ నటిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో అవుతున్న వారికి ఇమాన్వీ రీల్స్‌ కొత్తేమీ కాదు. తన డ్యాన్స్‌, స్టైల్‌తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకు ఆమె వేేస స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి. ఇప్పుడామె ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా హీరో సరసన నటించే అవకాశం దక్కడంతో సోషల్‌ మీడియాలో  ఇమాన్వీ పేరు ట్రెండ్‌ అవుతోంది. ఆమె ఎవరు అంటూ తెగ సెర్చ్‌ చేస్తున్నారు.  

Imanvi.jpg

శనివారం జరిగిన ప్రభాస్‌ నూతన చిత్రం ప్రారంభానికి ఇమాన్వీ 9Actress Imanvi) హాజరైంది. ఆమెను చూసిన యువత వివరాల కోసం ఇంటర్నెట్‌ వేదికగా వెతకడం మొదలు పెట్టారు. ఇమాన్వీ ఎస్మాయిల్‌ 1995 అక్టోబర్‌ 20న ఢిల్లీలో పుట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్‌ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్‌ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది, కుటుంబ సభ్యులు కూడా ఆమె ఇంట్రెస్ట్‌ను తెలుసుకుని ప్రోత్సహించారు. తన తండ్రి పోత్సాహం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి, యూట్యూబ్‌ చానెల్‌  ప్రారంభించింది.  ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్‌. నీకు సపోర్ట్‌గా ఉంటాం’ అని ఇమాన్వీ తండ్రి ప్రోత్సహించారట. ఈ విషయాన్ని ఆమె ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఫుల్‌ టైమ్‌ డ్యాన్స్‌, ఈవెంట్స్‌, డ్యాన్స్‌ షోలపై దృష్టి పెట్టి నెమ్మదిగా క్రేజ్‌ సొంతం చేసుకుంది. ుూడ్యాన్స్‌ అంటే బాడీని షేక్‌ చేయడమే కాదు, ముఖంలో హావభావాలను పలికించడం కూడా తెలియాలి అని చెబుతోంది ఇమాన్వీ. 

Imanviii.jpg

"ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచే అమ్మ నాకు చెప్పింది. డాన్స్ లో మెళకువలు చెప్పింది. బాలీవుడ్‌ నటులు రేఖ, మాధురీ దీక్షిత్‌, వైజయంతీ మాల వంటి హీరోయిన్‌లు నటించిన సినిమాలు చూపిస్తూ ‘వాళ్లు డ్యాన్స్‌ చేేసటప్పుడు హావభావాలు పరిశీలించు’ అని అమ్మ చెబుతుండేది. అలా డ్యాన్స్‌ మాత్రమే కాదు, అందుకు తగినట్లు ఎక్స్‌ప్రెషన్స పలికించడం నేర్చుకున్నాను. ఎప్పటికప్పుడు మ్యూజిక్‌ యాప్‌లలో కొత్తగా యాడ్‌ అయ్యే కొత్త పాటలు పదే పదే వినడం నాకు అలవాటు’’ అని ఇమాన్వీ చెప్పింది. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్‌లను జోడించి రీక్రియేట్‌ చేస్తుంది. రీల్స్‌ చేసేటప్పుడు ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు వర్క్‌షాప్‌ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు, రీల్‌ చేేస సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి. అందుకు కాస్ట్యూమ్స్‌ ఏంటి? ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అని చెబుతుంది. ఇమాన్వీ చేసే రీల్స్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.   

Updated Date - Aug 17 , 2024 | 07:17 PM