Director Shankar: టీవీలు, పేపర్లు అదే గుర్తు చేశాయి.. అందుకే..!

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:53 AM

'భారతీయుడు-2’ (Indian 2)చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం చెబుతున్నారు దర్శకుడు శంకర్‌. 28 ఏళ్ల తర్వాత వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి  ఇప్పుడాయన సీక్వెల్‌గా 'భారతీయుడు 2' తీశారు.

Director Shankar: టీవీలు, పేపర్లు అదే గుర్తు చేశాయి.. అందుకే..!

'భారతీయుడు-2’ (Indian 2)చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం చెబుతున్నారు దర్శకుడు శంకర్‌. 28 ఏళ్ల తర్వాత వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి  ఇప్పుడాయన సీక్వెల్‌గా 'భారతీయుడు 2' తీశారు. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్‌ 2 రూపొందించేందుకు అంత గ్యాప్‌ ఎందుకు వచ్చిందో దర్శకుడు శంకర్‌ (Shankar) తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

‘‘భారతీయుడు’ తర్వాత నేను ఇతర కమిట్‌మెంట్స్‌ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యా. అప్పటికి పత్రికల్లో, టీవీల్లోనో లంచం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘మళ్లీ భారతీయుడు వేస్త ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. మరోవైపు, చెప్పాలనుకున్న విషయాన్ని ‘భారతీయుడు’లోనే చెప్పేశాం.. సీక్వెల్‌ అవసరమా అనుకున్నా. ఆ సందేహంలోనే సంవత్సరాలు గడిచాయి. కానీ అవినీతి ఇంకా అలానే ఉందని న్యూస్‌ పేపర్లు, టీవీలు మళ్లీ గుర్తుచేశాయి. అప్పుడే ‘భారతీయుడు’ పార్ట్‌ 2కు బీజం పడింది.. ‘2. ఓ’ సినిమా పూర్తయిన తర్వాత ‘భారతీయుడు 2’ కథ రెడీ చేశా. 2019లో సినిమాని మొదలుపెట్టా. సీక్వెల్‌ తెరకెక్కించడం ఓ సవాలు. తొలి భాగం నేపథ్యమేంటో, అందులోని పాత్రల తీరు ఎలాంటిదో ప్రేక్షకులకు తెలుసు కాబట్టి రెండో భాగం అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టే ఈ సినిమా తీశాం.

Kamal.jpg

కట్‌ చేయడానికి మనసు అంగీకరించలేదు..
‘‘ఒక రాష్ట్రంలో జరిగే కథతో భారతీయుడు వచ్చింది. దాని నిడివి 3 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో  జరిగే కథగా చూపించబోతున్నాం. అందుకే నిడివి పెరిగింది. ప్రతి సన్నివేశం ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. ఎడిటింగ్‌లో ఒక్క సీన్‌నూ  కట్‌ చేయడానికి నా మనసు అంగీకరించలేదు. ఆ కారణంగానే రెండు భాగాలుగా తీసుకొస్తున్నా. మరో ఆరు నెలల్లో ుభారతీయుడు 3’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పార్ట్‌ 3లోనే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ వంటి చిత్రాలకు సీక్వెల్‌ తీయమని కొందరు నన్ను అడిగారు. ఆ సినిమాలకు పార్ట్‌ 2 తెరకెక్కించాలని ఓ సందర్భంలో నాకు అనిపించింది. కానీ, నామమాత్రంగా వాటిని తీయకూడదు. సమయం వచ్చినప్పుడు బలమైన కథలతో తెరకెక్కిస్తా’’. 

Updated Date - Jul 02 , 2024 | 10:53 AM