Bhale Unnade: మారుతి, రాజ్ త‌రుణ్ సినిమా.. ‘భ‌లే ఉన్నాడే’

ABN , Publish Date - Jan 14 , 2024 | 05:04 PM

దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. తాజాగా రాజ్ త‌రుణ్ హీరోగా చేస్తున్న చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Bhale Unnade: మారుతి, రాజ్ త‌రుణ్ సినిమా.. ‘భ‌లే ఉన్నాడే’
raj tharun

దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి (Director Maruthi) యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

విభిన్నమైన సబ్జెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.


ఈ సినిమాకు 'భలే ఉన్నాడే (Bhale Unnade) అనే టైటిల్‌ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజ్ తరుణ్‌ని రాధగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. రాజ్ తరుణ్ (Raj Tarun) అందమైన చిరునవ్వుతో నడుస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో పువ్వులు, అతని డ్రేపింగ్ యాక్సెసరీలు, మేకప్ వస్తువులు కనిపించం క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ వైబ్‌లను క్రియేట్ చేస్తుంది.

కృష్ణ పాత్రలో మనీషా కంద్కూర్ (Manisha kandkur) కథానాయికగా పరిచయం అవుతుండగా, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్ (singeetham srinivasrao) కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి (చెప్పవే చిరుగాలి, పోతు రాజు ఫేమ్), అమ్ము అభిరామి (Ammu Abhirami) (నారప్ప ఫేమ్), లీలా శాంసన్ ఇతర ప్రముఖ తారాగణం.

నగేష్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర (shekar chandra) సంగీతం అందిస్తున్నారు. బిజి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ దాసరి వెంకట సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్ బి రామకృష్ణ రాజు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ కాగ, ”బేబీ” ఫేం సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్. దేవ్ సహ రచయిత. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయ‌నున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 05:04 PM