Bharata Natyam: మంచి.. ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ హౌస్ దొరికుంటే!
ABN , Publish Date - Apr 08 , 2024 | 04:41 PM
దొరసాని లాంటి పీరియాడిక్ లవ్ స్టోరీని సినిమాని ఆర్గానిక్ గా పొయేటిగ్ గా చేసి ఒక మంచి రచయిత, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కె.వి.మహేంద్ర ఇప్పుడు భరతనాట్యం అనే క్రైమ్ కామెడీ సినిమా చేసి తాను ఇలాంటి చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు.
ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.మహేంద్ర (KVR Mahendra) లేటెస్ట్ గా భరతనాట్యం (Bharata Natyam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీమ్ ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది.
దొరసాని లాంటి పీరియాడిక్ లవ్ స్టోరీని సినిమాని ఆర్గానిక్ గా పొయేటిగ్ గా చేసి ఒక మంచి రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు భరతనాట్యం (Bharata Natyam) సినిమా క్రైమ్ కామెడీ సినిమా చేసి తాను ఇలాంటి సినిమా కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. ఇందులో కొన్ని క్రైమ్ రిలేటెడ్ సన్నివేశాలు చిత్రీకరించిన విధానం చూస్తే కె.వి.మహేంద్ర (KVRMahendra) స్ట్రెంత్ తెలుస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వైవా హర్షా పై వచ్చే లాంగ్ ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్వేలా ఉన్నాయి.
వివేక్ సాగర్ లాంటి టెక్నీషియన్ తో వర్క్ చేయించడమే కాకుండా చిన్న బడ్జెట్ లోనే టెక్నికల్ స్టాండర్డ్స్ చూపించగలిగాడు. ఒక ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా చేసి ఉంటే ఇంకా సరియైన రిలీజ్ చేయబడి ఎక్కువ రీచ్ అయ్యేదని అనిపిస్తుంది. బెస్ట్ గా రాసిన రెండు మూడు పీరియాడిక్ క్రైమ్ డ్రామా స్క్రిప్ట్ లు ఉన్నాయని కె.వి.మహేంద్ర (KVRMahendra) చెబుతున్నాడు. వాటిని ఎవరితో సెటప్ చేయబోతున్నాడో చూడాలి.