Dil Raju: సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి స్టాండ్ ఇదే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:40 PM

కింగ్ నాగార్జున - కొండా సురేఖ ఇష్యూతో పాటు, రీసెంట్‌గా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం టాలీవుడ్‌ను టార్గెట్ చేసిందనేలా వార్తలు వచ్చిన నేపథ్యంలో కొత్తగా తెలంగాణ ఎఫ్‌డి‌సి చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన నిర్మాత దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీపై దిల్ రాజు స్టాండ్ ఏమిటనేది క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ దిల్ రాజు ఏమన్నారంటే..

Dil Raju and Revanth Reddy

హైదరాబాద్‌కు సమీపంలోని ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటు చూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తామని గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అదే మాట తెలంగాణ ఎఫ్‌డి‌సి చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన దిల్ రాజు నోటి నుంచి కూడా వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ విజన్‌తో తాము ముందుకు వెళతామని దిల్ రాజు స్పష్టం చేశారు.

Also Read- UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..


తెలుగు సినిమా పరిశ్రమను మరింత పెద్దదిగా చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు. నిజానికి 2014లోనే టాలీవుడ్ అభివృద్ధికి భూములు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా..‌ దశాబ్ద కాలంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ గతేడాది సీఎం రేవంత్ రాకతో ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.‌ ‌వచ్చే ఏడాది నుంచి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని.. కమిటీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా దిల్ రాజు ప్రకటించారు.


ఇదంతా చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. కింగ్ నాగార్జున - కొండా సురేఖ ఇష్యూ, రీసెంట్‌గా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం టాలీవుడ్‌ను టార్గెట్ చేసిందని.. పలు రాజకీయ పార్టీల నాయకులు, వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నెగిటివ్ ప్రచారాలకు తెరలేపిన సందర్భంలో..‌ రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

Also Read- Yearender 2024: 2024 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తారలు వీరే..

గత ప్రభుత్వ హయాంలో ఎఫ్‌డి‌సి చైర్మన్ పదవిని సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులకు కట్టబెట్టి దాన్నోక నామమాత్రపు నామినేటెడ్ పోస్ట్‌గా చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదే పదవిని సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తికి ఇచ్చారనే చర్చ ఇప్పటికే చిత్ర పరిశ్రమలో మొదలైంది. మరి ఇన్నాళ్లూ ఎఫ్‌డిసి చైర్మన్ లేక సినీ పరిశ్రమతో ప్రభుత్వానికి సరైన సంబంధాలు లేని తరుణంలో.. దిల్ రాజు రాక.. ఇప్పుడు సినీ పరిశ్రమకు ఏమేరకు ప్రయోజనాలను చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.

Also Read-Mohan Babu: మోహన్ బాబుకి షాకిచ్చిన హైకోర్టు

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2024 | 05:40 PM